ఎర్రబెల్లి వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలి: జీవన్ రెడ్డి డిమాండ్

By Arun Kumar PFirst Published Jan 19, 2020, 6:11 PM IST
Highlights

ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న ఎర్రబెల్లి దయాకరరావుకు మంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదని... వెంటనే అతడు తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. 

జగిత్యాల: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకి అధికార పార్టీ మద్యం, నగదు రూపేణా ప్రలోభాలకు గురిచేస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఇలా కుదరకపోతే చివరకు ఓటర్లపై బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలా అక్రమాలకు పాల్పడుతున్న మంత్రి దయాకర్ రావు కి రాజ్యాంగ బద్దంగా మంత్రిగా కొనసాగే హక్కు లేదని అన్నారు. 

ఎన్నికల నియమావళి అధికార పార్టీ నాయకులే ఉల్లంఘన చేస్తున్నారన్నారు. ఇప్పటికి యువకులకు ఉద్యోగాల కల్పన , నిరుద్యోగ భృతి హామీని అమలుచేయకపోగా 4 వేల కోట్ల ఫీజ్ రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చెయకపోవడంతో విద్యార్థులు కనీస సౌకర్యాలు పొందలేక పోతున్నారని అన్నారు. 

పీఆర్సీ అనేది ప్రభుత్వ ఉద్యోగుల హక్కని.. దాన్ని కూడా అమలు చేయడం లేదన్నారు. కనీసం మధ్యంతర భృతి కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. నిరుపేద వర్గాలకు సంబంధించి కొత్త రేషన్ కార్డు ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 9 రకాల నిత్యావసర వస్తువులు ఇచ్చేదని... ఇప్పుడు బియ్యం మినహా అన్ని నిలిపివేశారని తెలిపారు.

రెండోసారి అధికారంలోకి వచ్చి 20 మాసాలు గడిచింది అయినా డబుల్ బెడ్ రూమ్ ఊసే లేదని గుర్తుచేశారు. ఇంతవరకు ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. అదే టీఆరెస్ పార్టీ కార్యాలయం కోసం అయితే సంవత్సరంలోపే పూర్తి చేశారని తెలిపారు. 

read more  కరీంనగర్ ఎన్నికల ప్రచారం... సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ సీరియస్ కామెంట్స్

జీవన్ రెడ్డి ఏం చేశారు అని కొందరు  ప్రశ్నిస్తున్నారని.... పట్టణంలో ప్రజలకు త్రాగు నీరు, రోడ్ల నిర్మాణం అన్ని చేసింది మొత్తం జీవన్ రెడ్డియే అని గుర్తుంచుకోవలన్నారు. సంజయ్ ఎమ్మెల్యే అయి సంవత్సరం అవుతోంది ఇప్పటివరకు ప్రజలకు ఏదైనా చేసి ఉంటే చూపించాలన్నారు. 

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు సిద్దిపేట ఎలా ఉండేది, జగిత్యాల ఎలా ఉండేది ప్రజలు ఆలోచించాలని అన్నారు. ఎమ్మెల్యే సంజయ్ ఇంకా జీవన్ రెడ్డే ఎమ్మెల్యే అనుకుంటున్నారా...! ఏంటి అని  ప్రశ్నించారు.. ఇప్పుడు ఆయనకు అవకాశం వచ్చిందని... అభివృద్ధి చేసి చూపించాలని అందుకు తన వంతు సాయం చేస్తానని అన్నారు. 

read more  ఆ లక్ష ఓట్లు టీఆర్ఎస్ కే... తొమ్మిది మున్సిపాలిటీల్లో పెరిగిన అధికారపార్టీ బలం

ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర అప్పుల వాటా 60 వేల కోట్ల ఇప్పుడు 3 లక్షల కోట్ల అప్పుల ఉబిలోకి రాష్ట్రాన్ని నెట్టారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కి ఈ దేశ సమగ్రత పై ఏ మాత్రం అవగాహన ఉందొ ఆలోచన చేయాలన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టె బిల్లుల విషయంలో స్పష్టత లేని ముఖ్యమంత్రి ఎవరయినా ఉన్నారంటే అది ఒక్క తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రమేనని జీవన్ రెడ్డి విమర్శించారు. 

click me!