ఒళ్లుదగ్గర పెట్టుకుని పనిచేశా, కేసీఆర్ సీఎంలా కనిపించరు: మంత్రి గంగుల కమలాకర్

By Nagaraju penumala  |  First Published Sep 10, 2019, 4:07 PM IST

తాను మచ్చలేకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేశానని చెప్పుకొచ్చారు. ఇకపై కూడా మరింత బాధ్యతగా నడుచుకుంటానని తన వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. సంతృప్తిని ఇచ్చే శాఖ ఇచ్చారని సీఎం కేసీఆర్ ముఖంలో అనునిత్యం నవ్వు కనిపించేలా పనిచేస్తానన్నారు. 


 
కరీంనగర్: తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్‌ జిల్లా అంటే కేసీఆర్ కు ఎంతో అభిమానం అని అందుకే ఈ జిల్లా నుంచి నలుగురికి మంత్రిపదవులు ఇచ్చారని స్పష్టం చేశారు. 

సీఎం కేసీఆర్‌కు కరీంనగర్‌ అంటే సెంటిమెంట్‌ అని అందుకే నలుగురికి మంత్రులుగా మరొకరికి క్యాబినెట్ హోదా పదవి ఇచ్చారని తెలిపారు. జిల్లాకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు.  

Latest Videos

undefined

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి విడతలోనే మంత్రి పదవి ఆశించినట్లు చెప్పుకొచ్చారు. రెండో విడతలో అవకాశం రావడంతో తన జీవితకాలం రక్తం ధారపోసి పార్టీ కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.  

తనకు కేటాయించిన పౌర సరఫరాల శాఖను నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతానని చెప్పుకొచ్చారు. రైస్‌ మిల్లర్లు ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసి మంచి ఫలితాలు రాబట్టేలా సహకరించాలని మంత్రి గంగుల కోరారు. 

కరీంనగర్‌ నియజకవర్గం నుంచి వరుసగా గెలిచిన చరిత్ర ఏ నాయకుడికి దక్కలేదని కానీ తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు తాను రుణపడి ఉంటానని హామీ ఇచ్చారు.  

తాను మచ్చలేకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేశానని చెప్పుకొచ్చారు. ఇకపై కూడా మరింత బాధ్యతగా నడుచుకుంటానని తన వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. సంతృప్తిని ఇచ్చే శాఖ ఇచ్చారని సీఎం కేసీఆర్ ముఖంలో అనునిత్యం నవ్వు కనిపించేలా పనిచేస్తానన్నారు. 

టీడీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికి కేసీఆర్ స్పూర్తితో టీడీపీలో తెలంగాణ వాదాన్ని వినిపించి పార్టీని వీడిన మెుట్టమొదటి ఎమ్మెల్యే తానేనని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ను చూస్తే సీఎంలా కనిపించరని ఆయన ఓ డిక్షనరీ అంటూ ప్రశంసించారు.  

కేసీఆర్ గొప్ప మానవతావాది అని ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి అని కొనియాడారు. 2018 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ బొమ్మతోనే గెలిచామని రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా కేసీఆర్ బొమ్మతోనే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.  

కరీంనగర్‌లో స్మార్ట్ సిటి పనులు ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. కరీంనగర్ కు స్మార్ట్ సిటి తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌దేనని పొగడ్తలతో ముంచెత్తారు. నగరంలో రోడ్లను అద్భుతంగా తీర్చిదిద్దుతానని రెట్టింపు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. 

దసరాకు ఐటీ టవర్ కంప్లీట్ చేసి, 3600 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి గంగుల హామీ ఇచ్చారు. బిజినెస్ సెంటర్‌గా, పర్యాటక కేంద్రంగా కరీంనగర్‌ను నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేశారు. 

పార్టీ పట్ల విధేయతతో ప్రతీ కార్యకర్త పనిచేయాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. మానేర్ రివర్ ఫ్రంట్ రూ. 506 కోట్లకు జీవో ఇచ్చారని చెప్పుకొచ్చారు. కరీంనగర్‌లో మెడికల్ కాలేజీ కోసం కేంద్రం నుంచి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

click me!