మానేరు నదిలో కేసీఆర్ ఐలాండ్....అభివృద్దికి ఐదు కోట్లు మంజూరు

By Arun Kumar P  |  First Published Nov 3, 2019, 12:02 AM IST

కరీంనగర్ లోని మానేరు నదిలో టూరిజం శాఖ నిర్మిస్తున్న కేసీఆర్ ఐలాండ్ కు ప్రభుత్వం 5 కోట్ల నిధులు మమంజూరు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా జిల్లా మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు.


కరీంనగర్: మానేరు నది మధ్యలో మైసమ్మగుట్టపై నిర్మించ తలపెట్టిన కేసీఆర్ ఐలాండ్ అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు కోట్లు మంజూరు చేసింది.  ఇవాళ(శనివారం)టూరిజం శాఖ ఈడితో కలిసి మంత్రి గంగుల కమలాకర్  నిర్మాణ ప్రాంతాన్ని స్వయంగా  సందర్శించి ఈ విషయాన్ని వెల్లడించారు.  

ఈ సందర్భంగా టూరిజం ఈడి మాట్లాడుతూ..స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గంగుల చొరవతోనే ఈ నిధులు మంజూరయ్యాయని అన్నారు. వీటిని ఉపయోగించి మానేరుకు  పర్యాటక శోభ తీసుకువస్తామన్నారు. 

Latest Videos

undefined

కేసీఆర్ ఆలాండ్ పేరుతో నదిమధ్యలో టూరిజం శాఖ అద్భుతమైన నిర్మాణాలు చేపడుతోంది. ఆధునిక హంగులతో అత్యంత విశాలంగా ఎంట్రెన్స్ లాబీ, పూర్తిగా అద్దాలతో బాంకెట్ హాల్, మెడిటేషన్ హబ్, యూనెక్స్ పార్లర్, డబుల్‌కాట్ బెడ్స్‌తోపాటు ఆధునిక వసతులతో ఐదు ప్రీమియం సూట్స్  ఏర్పాటు చేయనున్నారు.

read more 5వ తేదీ అర్ధరాత్రి వరకే డెడ్‌లైన్: ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ ఫైనల్ ఛాన్స్

ఇండోనేషియా ఆర్కిటెక్చర్ నమూనాలో 18 వెదురు కాటేజీలు,40 మందికిపైగా విందు చేసుకునేందుకు వీలుగా ఫ్లోటింగ్ రెస్టారెంట్, క్యాండిల్‌లైట్ డిన్నర్, కాక్‌టెల్ పార్టీల కోసం నలుమూలలా ఫ్లోటింగ్ బ్రిడ్జీలు, వెన్‌స్టార్ హోటల్‌కు మించిన సదుపాయాలతో వీవీఐపీల కోసం గుట్టపైభాగంలో ప్రెసిడెన్షియల్ సూట్, పిల్లలు, పెద్దలకు వేరువేరుగా స్విమ్మింగ్ పూల్స్, రెండు ఎలివెటేడ్ బ్రిడ్జీలు, పర్యాటకులు వివిధ సూట్స్‌కు వెళ్లడానికి కావాల్సిన లిఫ్టులు ఏర్పాటు చేయనున్నారు.

కరీంనగర్ రెనోవేషన్ సిటీలో భాగంగా నిర్మించనున్న కేసీఆర్ ఐలాండ్‌ను ఏడాదిలోపు పూర్తిచేయడానికి కాంట్రాక్టు సంస్థలు తమకు హామీ ఇచ్చినట్లు ఈడి వెల్లడించారు. ఇది పూర్తయితే దేశ, విదేశాలనుంచి పర్యాటకులు తరలివస్తారన్నారు.

మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.... యుద్ధప్రాతిపదికన పనులు చేయడానికి కరీంనగర్ కార్పొరేషన్‌కు సీఎం కేసీఆర్ ఇచ్చిన రూ.100 కోట్ల నుంచి రూ.3 కోట్లు కేటాయించామని.... మరో రూ.2 కోట్లను పర్యాటకశాఖ కేటాయించిందన్నారు. దశలవారీగా జరిగే నిర్మాణాలకు ముందుముందు కావాల్సిన నిధులను కేటాయిస్తామని.... కేసీఆర్ ఐలాండ్ కరీంనగర్‌కే కాదు యావత్ తెలంగాణకు ఒక మణిహారంలా నిలువనున్నదన్నారు.పర్యాటకరంగానికే ఇదో ఐకాన్‌గా నిలుస్తుందన్నారు. 

read more  కేసీఆర్: ఏమైతది.. ఆర్టీసీ ఉండదు, కోదండరామ్, రేవంత్ రెడ్డిలకు రిప్లై

సాధారణంగా సముద్రాల్లో ఈ తరహా ఐలాండ్లను ఏర్పాటుచేస్తారని...కానీ అక్కడ ఎక్కువ రోజులు బస చేయలేం. కానీ ఎల్‌ఎండీ దీనికి పూర్తిగా భిన్నమని తెలిపారు. మంచి నీళ్ల మధ్య ఏర్పాటుచేసే ఈ పర్యాటక ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ ఉంటుందని భావిస్తున్నామని  తెలిపారు.

 ఎల్‌ఎండీలో ఉన్న గుట్ట మన రాష్ట్రంలో మరే ప్రాజెక్టులోనూ కనిపించదని... అందులోనూ నాలుగు ఎకరాల గుట్ట ఉండటం వల్ల ఆ స్థలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ప్రపంచస్థాయి పరిజ్ఞానంతో నిర్మించే కేసీఆర్ ఐలాండ్ తెలంగాణ పర్యాటకరంగానికే ఒక ఐకాన్‌గా నిలుస్తుందని... దశలవారీగా పనులను పకడ్బందీగా చేస్తామన్నారు. పర్యాటకుల భద్రతకు పెద్దపీట వేసేలా నిర్మాణాలుంటాయని మంత్రి స్పష్టం చేశారు.  


 

click me!