పోలీస్ స్టేషన్ కు వచ్చిన యువతిపై కానిస్టేబుల్ లైంగిక వేధింపులు...

Arun Kumar P   | Asianet News
Published : Feb 21, 2020, 04:50 PM IST
పోలీస్ స్టేషన్ కు వచ్చిన యువతిపై కానిస్టేబుల్ లైంగిక వేధింపులు...

సారాంశం

ప్రజలను కాపాడాల్సిన గౌరవప్రదమైన పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ పై  మహిళపై లైంగిక వైధింపులకు పాల్పడిన సంఘటన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వెలుగుచూసింది. 

కరీంనగర్: ప్రజలకు రక్షణ అందించాల్సిన ఖాకీ కామవాంచతో దారుణానికి పాల్పడ్డాడు. పోలీసునంటూ బెదిరించి తనపై కానిస్టేబుల్ దాడి చేశాడంటూ ఓ మహిళ సిరిసిల్ల పట్టణ పోలీసులను ఆశ్రయించింది. అయితే సదరు కానిస్టేబుల్ కూడా అదే పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నప్పటికి అతడిపై కేసు నమోదయ్యింది. 

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సిరిసిల్ల పట్టణానికి చెందిన మహిళ  ఓ కేసు విషయమై పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. ఈ సమయంలోనే అదే  స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఆమెపై కన్నేశాడు. అనంతరం అతడు తనను లైంగికంగా వేధించడం ప్రారంభించాడని... ఈ మధ్య అతడి వేధింపులు మరీ ఎక్కువవడంతో తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించిన బాధిత యువతి తెలిపింది. 

read more  భార్య చెల్లిపై కన్నేసి బావ.. నగ్నంగా ఫోటోలు తీసి.. పదేళ్లుగా నరకం..

మహిళ ఫిర్యాదును స్వీకరించి సదరు కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని... నేరం నిర్దారణ అయితే కానిస్టేబుల్ పై చట్టరిత్యా  చర్యలు తీసుకోవడమే కాదు శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. 


 

PREV
click me!

Recommended Stories

పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్: కరీంనగర్‌ నుండి ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం
దుబాయ్‌లో జైలు శిక్ష, విముక్తి: 18 ఏళ్లకు హైద్రాబాద్‌కు, భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు