విధుల్లో నిర్లక్ష్యం... ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు

By Arun Kumar P  |  First Published Jan 10, 2020, 6:12 PM IST

గ్రామాల్లో సమస్యల పరిష్కారం, అభివృద్ది కోసం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పనులు చేపట్టడంలొ నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అధికారులపై సిరిసిల్ల కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. 


కరీంనగర్:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ది కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమం పల్లెప్రగతి.  స్వయంగా సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమ అమలుపై ఎంతో శ్రద్ద చూపిస్తుండటంతో మంత్రులు, ఎమ్మెల్యేలతో  పాటు జిల్లా కలెక్టర్లు, స్థానిక అధికారులు దీనిపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పనుల్లో నిర్లక్ష్యం వ్యహించిన ఇద్దరు అధికారులపై రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణభాస్కర్ చర్యలు తీసుకున్నారు. 

ఇటీవలే ప్రారంభమైన పల్లెప్రగతి రెండవ విడత పనులలో నిర్లక్ష్యం వహించినందుకు ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్స్ ను సిరిసిల్ల కలెక్టర్ సస్పెండ్  చేశారు. వారికి మెమోలను కూడా జారీచేశారు. గంభీరావుపేట మండలం మల్లుపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ మారటి రవికుమార్, మల్లారెడ్డిపేట ఫీల్డ్ అసిస్టెంట్ విజయ్ కుమార్ లను  సస్పెండ్ చేసి మెమోలను జారీ చేయాలని డి.ఆర్.డి.ఓ అధికారినికి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 

Latest Videos

undefined

read more  వరంగల్‌లో దారుణం: యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

గ్రామాల అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో  భాగంగా ఇప్పటికే మొదటి విడత పూర్తయ్యింది. అయితే ఇందులో మిగిలిపోయిన పనులను చేపట్టేందుకు ఇటీవలే రెండో విడతను ప్రారంభించారు. 

తొలివిడత పల్లె ప్రగతి కార్యక్రమంలో నెలరోజులపాటు సాగింది. ఇందులో ఏళ్లతరబడి పెండింగ్ లో వున్న గ్రామ సమస్యలు సైతం పరిష్కారమయ్యాయి. ఇదే స్పూర్తితో రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమం కూడా సాగుతోంది. మంత్రి కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం వరంగల్‌ రూరల్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

click me!