కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికకు లైన్ క్లియర్... నోటిఫికేషన్ జారీ

By Arun Kumar PFirst Published Jan 9, 2020, 9:03 PM IST
Highlights

కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలపై  నెలకొన్న సస్పెన్స్ కు తెరపడింది. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ కార్పోరేషన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. 

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్దమైంది. రాష్ట్ర హైకోర్టు తీర్పుతో ఈ కార్పోరేషన్ ఎన్నికల నిర్వహణపై క్లారిటీ వచ్చింది. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఎన్నికల సంఘం కరీంనగర్ కార్పొరేషన్ కు రిజర్వేషన్లు ఖరారు చేసిన అనంతరం ఈ నోటిపికేషన్ ను ప్రకటించింది. ఈ కార్పొరేషన్  పరిధిలోని మొత్తం 60 డివిజన్ లకు ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 10 నుంచి 12వ తేదీ వరకు నామినేషన్లు, 13న నామినేషన్ల పరిశీలన వుండనుంది. తిరస్కరించిన నామినేషన్లపై14 అప్పీల్ చేసుకునే అవకాశం, 16న నామినేషన్ల ఉపసంహరణ  వుండనుంది. 24వ తేదీన పోలింగ్ నిర్వహించిన 27న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 

READ MORE మున్సిపల్ ఎన్నికలు 2020: గులాబీ గూటిలో కొట్లాటలకు బ్రేక్ ఇలా...

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ నెల 30న ఓటర్ల జాబితా ముసాయిదా విడుదలకానుంది. అలాగే ఈ నెల 31 నుంచి జనవరి 2 వరకు అభ్యంతరాలకు గడువుంది. డిసెంబర్ 31న జిల్లా అధికారులతో రాజకీయ పార్టీలు సమావేశం కానున్నాయి.

జనవరి 1వ తేదీన మున్సిపల్ కమీషనర్ల స్థాయిలో రాజకీయ పార్టీలు భేటీ అవుతాయి. జనవరి 3 నుంచి అభ్యంతరాలను ఈసీ పరిష్కరించనుంది. జనవరి 4న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. 

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్:

* జనవరి 7న నోటిఫికేషన్
* జనవరి 8 నుంచి 10 వరకు నామినేషన్లు
* జనవరి 11న నామినేషన్ల పరిశీలన
* జనవరి 12, 13న తిరస్కరణకు గురైన నామినేషన్లకు అప్పీల్‌ చేసుకునే అవకాశం
* జనవరి 14న నామినేషన్ల ఉపసంహరణకు గడుబు
* జనవరి 22న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్
* జనవరి 25న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్

గత నెల 22న విచారణ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోసం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ప్రభుత్వానికి ట్విస్టిచ్చింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టే విధించిన 75 మున్పిపాలిటీల్లో స్టేను వేకేట్ చేయించుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.

మున్సిపల్ పోల్స్: ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ

 తెలంగాణ రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు ఉన్నాయి. మున్సిపాలిటీలతో పాటు మరో 13 కార్పోరేషన్లు ఉన్నాయి.ఈ కార్పోరేషన్లలో ప్రస్తుతం పాలకవర్గాలు కొనసాగుతున్నాయి.

మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా తయారీని చేపట్టారు. అయితే రిజర్వేషన్ల ప్రక్రియలో  అవకతవకలు చోటు చేసుకొన్నాయని పలువురు హైకోర్టును ఆశ్రయించారు.

 మున్సిపాలిటీల్లోని ఓటర్ల జాబితాలో పొరపాట్లు జరిగాయని కూడ హైకోర్టును ఆశ్రయించిన వారు కూడ ఉన్నారు. దీంతో హైకోర్టు ప్రభుత్వంతో పాటు పిటిషనర్ల వాదనలను వింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిచేయాలని, రిజర్వేషన్ల ప్రక్రియలో అవకతవకలను సరిచేయాలని పిటిషనర్లు కోరారు.

అంతేకాదు రిజర్వేషన్లు, వార్డుల విభజన, ఓటర్ల జాబితాలో చోటు చేసుకొన్న పరిణామాల్లో అవకతవకలను సరిచేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టులో పిటిషనర్లు గట్టిగా వాదించారు


 

click me!