మున్సిపల్ ఎన్నికల హోరు...ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నామినేషన్ల వెల్లువ

By Arun Kumar PFirst Published Jan 9, 2020, 10:27 PM IST
Highlights

ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల హడావుడి ఊపందుకుంది. నామినేషన్ ప్రక్రియకు మరో రోజు మాత్రమే మిగిలివుండటంతో అభ్యర్థులు వేగంగా బరిలోకి దిగేందుకు కదులుతున్నారు. 

కరీంనగర్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలయ్యింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యింది.  ఇందుకోసం మరో రోజు మాత్రమే గడువు ముగియనుండటంతో నామినేషన్ల ప్రక్రియ వేగవంతమయ్యింది. ఈ క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా వివిధ పార్టీలకు చెందిన అభ్యర్ధులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పట్టణాలవారిగా నామినేషన్ల వివరాలు

సిరిసిల్ల మున్సిపల్ పరిధి లోని 39 వార్డులకు గాను రెండవ రోజున మొత్తం 71 నామినేషన్ లు దాఖలయ్యాయి.

జమ్మికుంట మున్సిపల్ పరిధిలో రెండో రోజు 66 నామినేషన్ దాఖలయ్యాయి (టీఆరెస్ -  36, బిజెపి - 06,కాంగ్రేస్- 08, ఎంఐఎం- 01, టిడిపి-01, ఇతరులు - 14 నామినేషన్లు దాఖలయ్యాయి )

హుజూరాబాద్​ మున్సిపాలీటీ పరిధిలో మొత్తం 63 నామినేషన్లు దాఖలయ్యాయి. ( టీఆర్​ఎస్​​– 32, బీజేపీ​–12, కాంగ్రెస్​–9, టీడీపీ–2, స్వతంత్ర–8)

జగిత్యాల జిల్లా మెటుపల్లి మున్సిపాలిటీ పరిధిలో 55 నామినేషన్లు దాఖలయ్యాయి. ( టీఆర్ఎస్- 23, బిజెపి-12, కాంగ్రెస్-06, ఎంఐఎం-02, ఇతరులు-12)

 జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీ మొత్తం 22 నామినేషన్లు దాఖలయ్యాయి. (టీఆర్ఎస్-10, బీజేపీ-2,  కాంగ్రెస్-8, ఇండిపెండెంట్-2)

జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో 92 నామినేషన్లు దాఖలయ్యాయి.  (టీఆర్ఎస్ 48, కాంగ్రెస్ 21, బిజెపి 15, ఎంఐఎం 1, ఇతరులు 7) 

జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీలో 91 నామినేషన్స్ దాఖలయ్యాయి. (టిఆర్ఎస్-37,ఇండిపెండెంట్లు-14, ఎంఐఎం-7,బిజెపి-10,కాంగ్రెస్-22సీపీఎం-1)

వేములవాడ మున్సిపాలీటీ పరిధిలో మొత్తం 83 నామినేషన్లు దాఖలయ్యాయి. ( టీఆర్​ఎస్​​– 19,బీజేపీ​–16, కాంగ్రెస్​–13, టీడీపీ–4, స్వతంత్రులు–31)  

click me!