కేటీఆర్ భయం అదే... స్వయంగా టీఆర్ఎస్ కార్యకర్తలతోనే...: పొన్నం ప్రభాకర్

By Arun Kumar PFirst Published Jan 6, 2020, 8:20 PM IST
Highlights

తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగంసిద్దం చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వేములవాడలో ప్రచారాన్ని ప్రారంభించింది.  

సిరిసిల్ల: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఈ క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించింది. మాజీ ఎంపీ, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఈ ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీని నిర్వహించింది. 

ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ వేములవాడ కి వచ్చినప్పుడు ఎందుకు అభివృద్ధిపై మాట్లాడలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అంటే టిఆర్ఎస్ పార్టీకి వణుకు ప్రారంభమైందన్నారు. ఈ విషయం మంత్రి కేటీఆర్ ఓ సభలో మాట్లాడిన మాటలను బట్టి స్పష్టంగా అర్థమవుతుందన్నారు. పలు సందర్భాల్లో కార్యకర్తలకు స్వయంగా కేటీఆరే ఈ విషయం చెప్పాడన్నారు. 

read more మున్సిపల్ ఎన్నికలు: కారును ఢీకొట్టేందుకు విపక్షాల వ్యూహలు

తెలంగాణలో ఎంత మందికి డబుల్ బెడ్ రూమ్స్ ఇచ్చారో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలని పొన్నం ప్రశ్నించారు. ఎన్నికలప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయిని... ఆ తర్వాత పట్టించుకోవడం కాదు కదా నియోజకవర్గంవైపు రావడమే మరిచిపోతున్నారని అన్నారు.  

తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ కాశీ రాజన్న ఆలయం అభివృద్ధికి నోచుకోలేక భక్తులు ఇబ్బందులు పడుతుంటే ఇన్నాళ్లు ముఖ్యమంత్రి చూస్తూ వున్నారు తప్ప  ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్నాయి కాబట్టే ఆలయ అబివృద్ది గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ ఆలయాన్ని  ఎవరూ పట్టించుకోరని పేర్కొన్నారు.

ఈనాటికి కూడావేములవాడ పట్టణంలో మిషన్ భగీరథ నీరు ఇవ్వడంలేదని... అయినా ఓట్లు ఎలా అడుగుతారని టీఆర్ఎస్ ను  ప్రశ్నించారు. ప్రజలకు టిఆర్ఎస్ నాయకులు ఇచ్చిన హామీలు నేరవేర్చాలని... ఆ దిశగా ప్రజలు కూడా వారిని నిలదీయాలని సూచించారు. లేదంటే సరైనరీతిలో బుద్ది చెప్పాలన్నారు.

read more  సీఎంగా కేటీఆర్: ప్లాన్ రెడీ,కేసీఆర్ భవిష్యత్తు ఆచరణ ఇదీ?

విభజన సమయంలో ధనిక రాష్ట్రంగా వున్న తెలంగాణను టీఆర్ఎస్ అప్పుల రాష్ట్రంగా మార్చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో అబివృద్ది, పేద ప్రజల సంక్షేమం జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో  
మరో కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ తో పాటు భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యారు.  

 

click me!