శాయంపేటలో కాల్పులు: రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తిరుమల్ రెడ్డి అరెస్ట్

Published : Feb 14, 2020, 10:28 AM ISTUpdated : Feb 14, 2020, 11:48 AM IST
శాయంపేటలో కాల్పులు: రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తిరుమల్ రెడ్డి అరెస్ట్

సారాంశం

ఉమ్మడి కరీంనగర్ జిల్లా శాంయపేటలో శుక్రవారం నాడు కాల్పుల ఘటన చోటు చేసుకొంది. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తిరుమల్ రెడ్డి  కాల్పులకు దిగాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.


పెద్దపల్లి: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి సమీపంలోని శాయంపేటలో శుక్రవారం నాడు ఉదయం కాల్పుల ఘటన చోటు చేసుకొంది. ఈ ఘటనకు పాల్పడన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తిరుమల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసకొన్నారు.

శుక్రవారం నాడు  ఉదయం తిరుమల్ రెడ్డి తన వద్ద ఉన్న  తుపాకీతో గాల్లోక కాల్పులు జరిపాడు. ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొన్నారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:సదానందం రిమాండ్ రిపోర్ట్: యూట్యూబ్‌లో చూసి ఏకే-47 వాడాడు

పెళ్లి ఊరేగింపు సమయంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తిరుమల్ రెడ్డి గాల్లోకి కాల్పులు జరిపినట్టుగా స్థానికులు చెబుతున్నారు.  అయితే  తిరుమల్ రెడ్డి కాల్పులు జరిపింది లైసెన్స్‌డ్ తుపాకీయా లేదా అనే విషయమై కూడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆయనకు తుపాకీ ఎక్కడి నుండి వచ్చిందనే విషయమై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో  ఇటీవల కాలంలో కాల్పుల ఘటనలు ఎక్కువగా చోటు చేసుకొంటున్నాయి. అక్కన్నపేటలో సదానందం కాల్పుల ఘటన మరువకముందే తాజాగా తిరుమల్ రెడ్డి ఉదంతం వెలుగు చూసింది. 

 


 

PREV
click me!

Recommended Stories

పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్: కరీంనగర్‌ నుండి ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం
దుబాయ్‌లో జైలు శిక్ష, విముక్తి: 18 ఏళ్లకు హైద్రాబాద్‌కు, భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు