ఎస్సీ అమ్మాయిలపై టీఆర్ఎస్ నేత వేధింపులు... బాధితులకు కేటీఆర్ భరోసా

By Arun Kumar P  |  First Published Feb 20, 2020, 3:54 PM IST

రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ విద్యార్థులపై టీఆర్ఎస్ నేత లైంగింక వేధింపులకు పాల్పడిన సంఘటన సంచలనంగా మారిన విషయం  తెలిసిందే. తాజాగా ఈ హాస్టల్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పరిశీలించారు.


కరీంనగర్: సిరిసిల్లలోని ఎస్సీ హాస్టల్ లో వుంటున్న విద్యార్థిణులను స్థానిక టీఆర్ఎస్ లీడర్ దేవయ్య లైంగికంగా వేధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం బయటపడిన వెంటనే మంత్రి కేటీఆర్ సదరు నాయకున్ని పార్టీ నుండి సస్పెండ్ చేసి బాలికలను అండగా వుంటానని ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన తాజాగా ఈ ఘటన జరిగిన ఎస్సీ హాస్టల్ ను సందర్శించారు. 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి రక్షణకోసం మరిన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా హాస్టల్లో పనిచేసే సిబ్బంది మొత్తం మహిళలే వుండేలా చూడాలని ఆదేశించారు. 

Latest Videos

undefined

అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... బాలికలపై వేధింపులకు పాల్పడిన తమ పార్టీ నాయకుల్ని ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా వెంటనే అతన్ని అరెస్టు చేయించి రిమాండ్ చేశామన్నారు. ఇలాంటి ఘటనలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఉపేక్షించబోదన్నారు. 

అమ్మాయిలతో అసభ్యంగా... అతన్ని సస్పెండ్ చేశాం... కేటీఆర్

ఇలాంటి దురాగతాలకు పాల్పడే సంఘటనలపై మౌనంగా వుండకుండా అమ్మాయిలు గొంతెత్తాలని సూచించారు. ఇక్కడ ఒక్కచోటే కాదు జిల్లాలోని బాలికల హాస్టల్లకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. 

ఆడపిల్లలకు ఆత్మరక్షణ కోసం శిక్షణ శిబిరాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడా కూడా పునరావృతం కాకూడదని... దీనిపై ఎలాంటి రాజకీయం చేయకూడదని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. 

సిరిసిల్లలోని ఎస్సీ హాస్టల్లో క్యాటరింగ్‌ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న దేవయ్య టీఆర్ఎస్ నేతగా కూడా వ్యవహరించేవాడు. అ క్రమంలోనే అతడు హాస్టల్ విద్యార్థులను లైంగాకంగా వేధించేవాడు. రూ.వెయ్యి ఇస్తా నాతో పడుకుంటావా అంటూ హాస్టల్ యువతులను వేధించేవాడు. బలవంతంగా వారికి పోర్న్ వీడియోలు చూపించేవాడు. కాగా అతడికి అక్కడ వంట మనిషిగా పనిచేస్తున్న విజయమ్మ సహకరించేది. దేవయ్య వెకిలిచేష్టలకు విద్యార్థినులు భోరుమంటే, ‘డబ్బులు ఇస్తానంటున్నాడు కదా?’ అంటూ దేవయ్యకు వత్తాసుగా మాట్లాడేది.

ఈ వ్యవహారం బయటపడటంతో  దేవయ్య, విజయమ్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే హాస్టల్‌ వార్డెన్‌ భూదేవిని సస్పెండ్‌ చేస్తూ జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. దేవయ్యను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. 
 

click me!