కరీంనగర్ పై కేసీఆర్ ప్రత్యేక దృష్టి... అందుకే భారీ నిధులు: మంత్రి గంగుల

By Arun Kumar PFirst Published Dec 4, 2019, 9:03 PM IST
Highlights

కరీంనగర్ నడిబొడ్డున ఉన్న ఇందిరా నగర్ కాలనీ అభివృద్ధికి కట్టుబడి అంబేద్కర్ కమ్యూనిటీ భవనానికి 25 లక్షలు కేటాయించి ఆధునిక హంగులతో నిర్మించినట్లు మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.  

కరీంనగర్:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన కులాల అభ్యున్నతికి కృషి చేస్తుందని తెలంగాణ బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం పట్టణంలోని 14వ డివిజన్ ఇందిరానగర్ కాలనీలో 25 లక్షలతో ఆధునిక హంగులతో  నిర్మించిన అంబేద్కర్ మెమోరియల్ కమ్యూనిటీ భవనాన్ని మంత్రి గంగుల ప్రారంభించారు.

ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మిస్తుందని, వారి అభ్యున్నతికి పాటు పడుతుందని అన్నారు. 

కరీంనగర్ నడిబొడ్డున ఉన్న ఇందిరా నగర్ కాలనీ అభివృద్ధిలో వెనుకబడి ఉందని అన్నారు. రానున్న రోజుల్లో అన్నిరోడ్లను సీసీరోడ్లుగా మారుస్తామని, మురికికాల్వలు నిర్మిస్తామని, త్వరలోనే అంచనాలు తయారుచేసుకుంటామని అన్నారు.

read more  ఆర్టీసీ చార్జీలు వెంటనే తగ్గించాలి...లేదంటే మరో ఉద్యమం...: టిడిపి హెచ్చరిక

అంబేద్కర్ కమ్యూనిటీ భవనానికి 25 లక్షలు కేటాయించి ఆధునిక హంగులతో ఈ భవనాన్ని నిర్మించామని, అదనపు నిర్మాణం కోసం మరో 20 లక్షలు కేటాయిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని కులాలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే కేసీఆర్ సంకల్పం అని అన్నారు.

కరీంనగర్ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక నిధులు కేటాయించారని వీటితో నగరంలో ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో స్థానిక యువతకు ఉద్యోగాలు లేవు నగరానికి ఒక కంపెనీ కూడా రాలేదని అన్నారు.

కరీంనగర్ పట్టణాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేబుల్ బ్రిడ్జి, మానేర్ రివర్ ఫ్రంట్ వంటి ప్రాజెక్టులు తీసుకొచ్చామని అన్నారు.ఇక్కడి బిడ్డలకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఐటి టవర్ నిర్మిస్తున్నామని అన్నారు.

read more  పక్షపాతం లేకుండా ప్రమోషన్లు...సీఎం జగన్ ను కలిసిన ఏఎస్పీలు

ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, మాజీ కార్పొరేటర్లు లంక రవీందర్, బండారి వేణు, వై సునీల్ రావు, ఎడ్ల అశోక్, ములుకుంట్ల రాజు ,రేణుక, బత్తుల శ్రీధర్ , గంగరాజు  పాల్గొన్నారు.

click me!