కక్షతో... మహిళ ఫోటోను కాల్ గర్ల్ గా చూపిస్తూ పోస్ట్

By Arun Kumar PFirst Published Nov 12, 2019, 6:52 PM IST
Highlights

కరీంనగర్ జిల్లాలో ఓ ఆకతాయి సోషల్ మీడియా వేదికన ఓ మహిళపై వేదింపులకు పాల్పడుతూ అడ్డంగా బుక్కయ్యాడు. యువతి క్యారెక్టర్ ని దెబ్బతీసేలా అతడి చర్యలపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని పోలీసులు తెెలిపారు.

కరీంనగర్: మందమర్రి నివాసి అయిన గాదాసు విజయ్ కుమార్ అనే వ్యక్తి ప్రైవేట్ వాహనాలపై డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. ఇతను కొద్ది నెలల క్రితం మంచిర్యాల పట్టణంలో ట్రావెల్స్ మరియు వాహన కన్సల్టెన్సీ నడిపే ఒక వివాహిత స్త్రీని కలిసి ఆమె వద్దనున్న టాక్సీ వాహనాలపై డ్రైవర్ గా ఉద్యోగం ఇవ్వమని కోరగా ఆమె అందుకు నిరాకరించింది. ఇదే విషయం గురించి ఫోన్ చేయగా మందలించడం జరిగినది. 

ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని ఆమెను ఎలాగైనా అవమానించాలని ఇంటర్నెట్ యందు ఆమెను కాల్ గర్ల్ గా చూపిస్తూ ఆకతాయి పేర్కొన్నారు.  ఆమె ఫోన్ నెంబర్ ను లోకాన్టో యాప్  నందు అప్లోడ్ చేయగా పలువురు వ్యక్తులు ఆ మహిళకు ఫోన్లు చేస్తుండడంతో ఆమె మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగినది. 

READ MORE  రివర్స్ డిమాండ్: భార్య వెళ్లిపోయింది, ఒంటరి పురుషుడి పింఛను ఇవ్వండి

ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్  ఎంఎల్ ముత్తి లింగయ్య, రామగుండం సైబర్ క్రైమ్ ఇన్స్‌పెక్టర్  బద్దె స్వామి సహాయంతో గూగుల్ మరియు లోకాన్టో యాప్ ల నుండి  సమాచారం తెప్పించి దాని ఆధారంగా నేరస్తుడు గాదాసు విజయ్ కుమార్ ను గుర్తించారు. తగిన శాస్త్రీయ ఆధారాలతో ఈరోజు పట్టుకొని అతని వద్దనుండి  మొబైల్ ఫోన్ ను సీజ్ చేసి అతనిని అరెస్ట్ చేయడం జరిగినది. 

ఈ క్రమంలో LOCANTO app ను పరిశీలించగా మంచిర్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత యువకులు పలువురు ఈ యాప్ నందు తమ ఫోన్ నెంబర్లు కాల్ బాయ్ గా నమోదు చేసుకున్నారని తెలిసినది. ఈ విషయంపై కూడా విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు. ఇంటర్నెట్ నందు కాల్ బాయ్స్ గా నమోదు చేసుకున్న విషయం గురించి విచారణ జరుగుతుందని త్వరలోనే అలాంటి వ్యక్తులను గుర్తించి వారిని కూడా పట్టుకోవడం జరుగుతుందని అన్నారు. 

READ MORE  నారాయణ కాలేజీ క్యాంపస్ లో మరో దారుణం.... విద్యార్థి ఆత్మహత్య

click me!