''తెలంగాణ పోలీస్ సంస్కరణల... సీఎం, డిజిపిలపై పక్కరాష్ట్రాల ప్రశంసలు''

By Arun Kumar PFirst Published Dec 5, 2019, 9:20 PM IST
Highlights

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నూతనంగా నిర్మించిన కోటపల్లి పోలీస్ స్టేషన్ ను గురువారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కమీషనర్ వి. సత్యనారాయణ ప్రారంభించారు.  

కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోటపల్లి మండలకేంద్రంలో నూతనంగా నిర్మించిన పోలిస్ స్టేషన్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ వి.సత్యనారయణ, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కోలేటి దామోదర్, ఎమ్మెల్సీ పురాణం సతీష్, జడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, మంచిర్యాల డీసీపీ డి. ఉదయ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. వీరంతా కలిసి పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా కోలేటి దామోదర్ గారు మాట్లాడుతూ... గత కొన్ని సంవత్సరాల నుండి పురాతన భవనం లో కొనసాగుతున్న పోలిస్ స్టేషను  కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి  పోలీస్ శాఖకు అధునాతన వాహనాలు ఇవ్వడం జరిగిందన్నారు. 

తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశానికి ఒక ఆదర్శంగా నిలిచిందని.... ఫ్రెండ్లీ పోలీసింగ్ సక్సెస్ అయ్యిందన్నారు. ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ పై ఎన్నో రాష్ట్రాల డీజీపీలు,  ముఖ్యమంత్రులు తెలంగాణ పోలీసులను సేవలను ప్రశంసించారని అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికత వినియోగిస్తూ పోలీసులు ముందుకు వెళుతున్నారని... ఎన్నో క్లిష్టమైన కేసులు చేదిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని అన్నారు. 

read more  బినామీ పవన్ తో చంద్రబాబు ఆడిస్తున్న నాటకమిది: సి రామచంద్రయ్య

ఒకప్పటి పోలీస్ వ్యవస్థకు ఇప్పటి పోలీస్ వ్యవస్థకు చాలా మార్పు వచ్చిందని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణా స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా కోటి  రూపాయలతో ఆత్యాదునిక సదుపాయాలతో పోలీస్ స్టేషన్ ను విశాలంగా నిర్మించడం జరిగింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కన్నెపల్లి, బీమారం, కోటపల్లి, అంతర్గం పోలీస్ స్టేషన్ లను మోడల్ పోలీస్ స్టేషన్ గా రూపుద్దిద్దుకోవడం జరుగుతుందన్నారు. 

పోలీస్ కమిషనర్ వి.సత్యనారయణ మాట్లాడుతూ..... శాంతిభద్రతలను కాపాడడం గురించి ప్రజల సహాయ సహకారాలు ఎంతో ముఖ్యమన్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణ ఆహ్లాదకరంగా ఉన్నప్పుడే అధికారులు సిబ్బంది ఉన్నతమైన సేవలు ప్రజలకు అందించగలరని అన్నారు. అంతేకాకుండా ప్రజలు నేరుగా పోలీస్ స్టేషన్ కి  వచ్చి వారి బాధలు చెప్పుకునే ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు.

read more పవన్=గాలిమాటలు, కళ్యాణం= పెళ్లి...: పవన్ పై అంబటి షాకింగ్ కామెంట్స్

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న గ్రామాలలో సిసి కెమెరాల ఏర్పాటుకు గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు సహకరించాలని కమీషనర్ కోరారు. ప్రజా సంరక్షణే లక్ష్యంగా తెలంగాణ పోలీసులు పాటుపడుతున్నారని అన్నారు.

 

click me!