పార్లమెంట్ ఫలితం ఎఫెక్ట్... బిజెపికి చెక్ పెట్టేందుకు గంగుల వ్యూహమిదే

By Arun Kumar PFirst Published Dec 21, 2019, 4:26 PM IST
Highlights

అతిత్వరలో మున్సిపల్ ఎన్నికలు జరపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైన నేపథ్యంలో రాష్ట్రంలో ఒక్కసారిగా ఎన్నికల వేడి మొదలయ్యింది. కరీంనగర్ లో అయితే ఎన్నికల కోసం రాజకీయ ఎత్తుగడలు  కూడా ప్రారంభమయ్యాయి.  

కరీంనగర్: మరికొద్దిరోజుల్లో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జగరనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు ఇప్పటివరకు అడ్డంకిగా నిలిచిన హైకోర్టు కూడా ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఎన్నికల  ఏర్పాట్లను ముమ్మరం  చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మరోసారి ఎన్నికల వేడి మొదలయ్యింది. ముఖ్యంగా ఎన్నికలు జరిగే పట్టణాల్లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. 

ఈ క్రమంలో కరీంనగర్ మున్సిపాలిటీ పరిధిలోని రాజకీయాలు రాష్ట్రం మొత్తాన్ని ఆకర్షిస్తున్నాయి. అక్కడి  ప్రజల తీర్పు ఎలా వుంటుందో రాజకీయ పండితులు సైతం ఊహించలేకపోతున్నారు. దీంతో అధికార టీఆర్ఎస్ అప్పుడే రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టి ఇతరపార్టీలను దెబ్బతీసే  పనిలో పడింది.  

స్థానిక మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ లోనే వుంటూ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇతర పార్టీలకు  చెందిన కొందరు మాజీ కార్పోరేటర్లను టీఆర్ఎస్ వైపు మళ్లించగలిగారు. మాజీ కార్పొరేటర్లు  మీస రమాదేవి, బీరయ్య తో పాటు దాదాపు 200 మంది ఇతర పార్టీల కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి గంగుల వారందరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

read more  బంగారు తెలంగాణ : సామాన్యుడు రోడ్డు మీద నడిచినా పన్నులేస్తారా?

ఈ చేరికల వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే  దాగున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లో బిజెపి హవా కొనసాగి ఎంపీగా బండి సంజయ్ గెలుపొందారు. సీనియర్ నాయకులు వినోద్ కుమార్ ఓటమిపాలయ్యారు. ఈ ఫలితం టీఆర్ఎస్ శ్రేణుల్లో నిరాశకు కారణమయ్యింది.

అయితే ఈ ఫలితం మున్సిపల్ ఎన్నికల్లో రిపీట్ అవ్వకుండా మంత్రి గంగుల ముందు జాగ్రత్త పడుతున్నారు. పార్లమెంట్ పలితంతో నిరాశచెందిన కార్యకర్తలో నూతన ఉత్తేజాన్ని నింపే  ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా పార్టీని  బలోపేతం చేసి బిజెపికి చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా పట్టణంలోని రెండో, మూడో శ్రేణి నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు సైతం స్వయంగా మంత్రి మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. 

read  more అచ్చంపేట ఘటనపై విచారణ: పోలీసుల చెంతకు శిశువు తల

అయితే  కరీంనగర్ బిజెపి శ్రేణులు కూడా మున్సిపల్ ఎన్నికల ఫలితంపై ధీమాతో వున్నారు. పట్టణంలో తమకు మంచి పట్టు వుందని... ఎంపీ సంజయ్ పాలోయింగ్ కూడా తమ కలిసివస్తుందని అంటున్నారు. ఇప్పటికే తాము మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్దంగా వున్నామని... మరోసారి కరీంనగర్ గడ్డపై కాషాయం జెండా ఎగరేయడం ఖాయమని  అంటున్నారు. 
  

click me!