కరీంనగర్‌లో సందడి చేసిన జబర్దస్త్ రేష్మీ

Siva Kodati |  
Published : Oct 02, 2019, 03:49 PM ISTUpdated : Oct 02, 2019, 05:36 PM IST
కరీంనగర్‌లో సందడి చేసిన జబర్దస్త్ రేష్మీ

సారాంశం

కరీంనగర్‌లొ ప్రముఖ సినీనటి, జబర్దస్త్ యాంకర్ రేష్మీ గౌతమ్ సందడి చేశారు. నగరంలోని శివ థియేటర్‌లో ఏర్పాటు చేసిన గ్రీన్ ట్రెండ్స్ స్టైల్ సెలూన్‌ను ఆమె బుధవారం ప్రారంభించారు

కరీంనగర్‌లొ ప్రముఖ సినీనటి, జబర్దస్త్ యాంకర్ రేష్మీ గౌతమ్ సందడి చేశారు. నగరంలోని శివ థియేటర్‌లో ఏర్పాటు చేసిన గ్రీన్ ట్రెండ్స్ స్టైల్ సెలూన్‌ను ఆమె బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా రేష్మీ మాట్లాడుతూ.. కరీంనగర్ అంటే తనకు చాలా ఇష్టమని, చాలా రోజుల తర్వాత మళ్లీ ఇక్కడకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ ట్రెండ్స్ బ్యూటీ సెలూన్‌లో మహిళలను, పురుషులను అందంగా తీర్చిదిద్దేలా కొత్త టెక్నాలజీతో రూపొందించిన సౌకర్యాలు ఉన్నాయన్నారు.

తను ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ...తనకు గుర్తింపును తీసుకొచ్చిన జబర్దస్త్‌కు ఎంతో రుణపడి ఉంటానని వెల్లడించారు. ప్రస్తుతం పలు సినిమాలతో పాటు టీవీ షోలలో నటిస్తూ బిజీగా ఉన్నానని రేష్మీ పేర్కొన్నారు. 

సంబంధిత వీడియో 

అన్నీ చెప్పేయమంటారా: మీడియాకు రేష్మి క్వొశ్చన్ (వీడియో)...

PREV
click me!

Recommended Stories

పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్: కరీంనగర్‌ నుండి ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం
దుబాయ్‌లో జైలు శిక్ష, విముక్తి: 18 ఏళ్లకు హైద్రాబాద్‌కు, భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు