వైరల్ ఫీవర్లు: కరీంనగర్‌లో ఆరోగ్య శిబిరాల ఏర్పాటు

By Siva Kodati  |  First Published Oct 3, 2019, 6:08 PM IST

వైరల్ ఫీవర్లు వణికిస్తుండటంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కరీంనగర్‌లో అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రలను ఏర్పాటు చేశారు


వైరల్ ఫీవర్లు వణికిస్తుండటంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కరీంనగర్‌లో అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రలను ఏర్పాటు చేశారు.

సాలంపూర్, సప్తగిరి కాలనీ, మంకమ్మ తోట, హౌసింగ్ బోర్డ్ కాలనీ, పద్మాశాలి స్ట్రీట్, కట్టరాంపూర్, నటరాజ్ వాడలలో అధికారులు ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నాలుగు వైద్య శిబిరాల్లో 199 మంది ప్రజలు చికిత్స చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రముల వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Latest Videos

undefined

తెలంగాణలో వైరల్ ఫీవర్స్ ఒక్కసారిగా విజృంభిస్తున్నాయి. ఇప్పటికే డెంగ్యూ వంటి ఫీవర్స్ తో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది.

కొన్ని ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్స్‌ తక్కువగా ఉండడం, మరికొన్ని చోట్ల సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్ని జిల్లాలోని ప్రధాన హాస్పిటల్స్‌లో 24 గంటల ఓపిని అందుబాటులోకి తెచ్చారు.
 

click me!