ఆయనకు నేను వీరాభిమానిని... మంత్రి పదవి కంటే...: గంగుల కమలాకర్

By Arun Kumar P  |  First Published Jan 24, 2020, 3:17 PM IST

కరీంనగర్ మున్సిపల్  కార్పోరేషన్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం జరుగుతున్న పోలింగ్ లో మంత్రి గంగుల కుటుంబ సమేతంగా పాల్గొన్ని ఓటుహక్కును  వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎంపై ప్రశంసలు కురిపించారు. 


కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం ప్రారంభమైన ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుతీరారు. ఈ క్రమంలో కరీంనగర్ కు చెందిన టీఆర్ఎస్ నాయకులు, మంత్రి గంగుల కమలాకర్  కుటుంబసమేతంగా పోలింగ్ స్టేషన్ కు ఓటుహక్కును వినియోగించుకున్నారు. సామాన్య ఓటర్ మాదిరిగానే మంత్రి క్యూలో నిల్చుని మరీ ఓటేశారు. 

Latest Videos

undefined

ఓటుహక్కును వినియోగించుకున్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... గతంలో  ఎన్నో సార్లు ఓటు వేశానని  అయితే  ఈసారి ఓటేయడం తనకెంతో ప్రత్యేకమన్నారు. ఎందుకంటే మంత్రిగా తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నానని... ఇలా కారు గుర్తుకు ఓటు వేయడం సంతోషం అనిపించింది.

Video: స్కూటీపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్...కార్యకర్త కోసం

70 శాతం పైగా ఓటర్లు టిఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేస్తున్నారని సమాచారం వుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన నగర అభివృద్ధిని చూసి స్థానిక ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితికి ఓటేస్తున్నారని అన్నారు. కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రజలంతా ముందుగానే నిర్ణయించుకున్నారని... ఇప్పుడు అదే చేస్తున్నట్లు  తెలిపారు.  

ఈ ఎన్నికలు అభివృద్ధికి, అభివృద్ధి నిరోదకులకు మధ్య  జరుగుతున్న ఎన్నికలుగా  ప్రజలు భావిస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆరే టీఆర్ఎస్ నాయకులందరి బలం , ధైర్యం అని... ఆయన బొమ్మతోనే ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. తాను మంత్రి గా కాకుండా కేసీఆర్ అభిమానిగా ఓటేస్తున్నానని గంగుల వెల్లడించారు.

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తుందని అన్నారు. ఓట్ల రూపంలో ప్రజలు తమ అభిమానాన్ని టీఆర్ఎస్ పై చాటుకుంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ అంటే నాలాంటి అభిమానులు కరీంనగర్ లో  లక్షల మంది ఉన్నారని...వారంతా కారు గుర్తుకే ఓటేస్తారని అన్నారు.  మంత్రిగా మొదటిసారి కారు గుర్తుకు ఓటేయడం గర్వంగా భావిస్తున్నాని గంగుల తెలిపారు.

read more  ఎంపీ మిస్సింగ్: అజ్ఞాతంలోకి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌?

70 ఏళ్లుగా కరీంనగర్ అభివృద్ధి కి నోచుకోలేదు కానీ 4 ఏళ్లలో కరీంనగర్ రూపు రేఖలు సీఎం కేసీఆర్ మార్చారన్నారు.  గతంలో ఎన్నడూ లేని విదంగా ఓటింగ్ జరుగుతుందని... ఏ పార్టీకి కూడా సింగిల్ మెజారిటీ రాదన్నారు.

2014 లో తాము ఇండిపెండెంట్లతో కలిసి పాలక వర్గం ఏర్పాటు చేసినట్లు గంగుల గుర్తుచేశారు. అయితే ఈసారి 75 శాతం సీట్లు టీఆర్ఎస్ కు వస్తాయని... ఎవరి అవసరం లేకుండా పాలకవర్గాన్ని ఏర్పాటుచేస్తామని మంత్రి  ధీమా వ్యక్తం చేశారు. కేవలం 25 శాతం సీట్ల  కోసమే మిగితా పార్టీలన్నీ పోటీ పడుతున్నాయన్నారు. 

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో  అద్భుతమైన ఓటింగ్ జరుగుతుందన్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రం నుండి అధిక నిధులు తెస్తాడని ప్రజలు భ్రమపడి ఎంపిగా బండి సంజయ్ ని గెలిపిస్తే... ఓట్లేసిన ప్రజలను ఆయన నిరాశ పరిచాడన్నారు. కేంద్రం నిధులు రాలేకపోగా జరుగుతున్న అభివృద్ధిని తన లెటర్ ప్యాడ్ లను ఉపయోగించి ఎంపీ అడ్డుపడుతున్నదని మంత్రి గంగుల విమర్శించారు. 

click me!