ఎంపీ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు: సీపీ కమలాసన్ రెడ్డి ప్రకటన ఇదే

By telugu team  |  First Published Jan 23, 2020, 3:56 PM IST

కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి విడుదల చేసిన ప్రకటనపై బిజెపి ఎంపీ బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమలాసన్ రెడ్డి విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం చదవండి.


కరీంనగర్: కరీంనగర్ లో జరిగిన సంఘటనలపై పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి విడుదల చేసిన ప్రకటనపై బిజెపి పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. తనను సంప్రదించకుండా ప్రకటన విడుదల చేయడమేమిటని ఆయన అడిగారు. బండి సంజయ్ కి ఆగ్రహం తెప్పించిన కమలాసన్ రెడ్డి పత్రికా ప్రకటన ఇదే....

త నాలుగు రోజుల క్రితం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గౌరవ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పై కిసాన్ నగర్ లో రాళ్ల దాడి జరిగిందంటూ, పలువురు కానిస్టేబుళ్లకు మరియు వారి కార్యకర్తకు దెబ్బలు తగిలాయని కరీంనగర్ లో అంతా టెన్షన్ నెలకొని ఉందని దూలం కళ్యాణ్ అను వ్యక్తి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలియజేస్తున్నాము.

Latest Videos

undefined

గౌరవ పార్లమెంటు సభ్యులు,  శాసన సభ్యులు మరియు ఇతర ప్రముఖులు ఎవరైనా ఏదైనా ప్రజా కార్యక్రమాలలో పాల్గొన్న సమయంలో గానీ, ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో  ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖ తరపున పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టడం జరుగుతున్నది. అంతేకాకుండా (24) గంటలు వారిని కంటికి రెప్పలా కాపాడుటకు పోలీసుశాఖ తరపున ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండే సాయుధులైన వ్యక్తిగత అంగరక్షకులను కూడా కేటాయించడం జరిగినది.

మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటినుండి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ఏ ప్రజా ప్రతినిధి పై కూడా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో  ఎక్కడా రాళ్ల దాడులు గానీ, భౌతికమైన దాడులు కానీ జరగలేదని,  అటువంటి  దాడి  జరిగి వుంటే,  అదే రోజు గౌరవ పార్లమెంటు సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకుని వచ్చే వారని, అంతేకాకుండా వారి వ్యక్తిగత రక్షణ కోసం కేటాయించిన పోలీసు సిబ్బంది వెంటనే వేగంగా స్పందించి ఉండేవారని తెలియజేస్తున్నాను.

అయినను, సోషల్ మీడియాలో కొంతమంది తెలిసీ తెలియని పరిజ్ఞానంతో  ఉద్దేశ్యపూర్వకంగా గౌరవ పార్లమెంటు సభ్యుడి పై రాళ్ల దాడి జరిగిందంటూ ఒక సందేశాన్ని ఫేస్ బుక్ మరియు వాట్సాప్ లో సర్క్యులేట్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న విషయం  ఆందోళనకరం.

Also Read: ఎంపీ మిస్సింగ్: అజ్ఞాతంలోకి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌?
 
కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు ప్రజల భద్రత కోసం ఎల్లవేళలా పనిచేస్తూ, పోలీసుల పట్ల గౌరవం ఇనుమడింపజేసి, కరీంనగర్ కమిషనరేట్ కు ఒక గుర్తింపును తీసుకొని వస్తున్నారని, ఇలాంటి  ప్రజలను తప్పుదోవ పట్టించే వార్తలు, సందేశాలు, సరికాదని తెలియజేస్తున్నాను.

ఎటువంటి చిన్న సంఘటనకు కూడా అవకాశం ఇవ్వకుండా, ప్రశాంతమైన వాతావరణంలో, ప్రజలు నిర్భీతితో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా, ఎన్నికలు సజావుగా జరగడానికి,  పోలీసుల నిరంతర శ్రమిస్తూ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారని తెలియజేస్తున్నాము.

సమాజం పట్ల ఏమాత్రం అవగాహన లేని కొంతమంది యువకులు సామాజిక వేదికలైన వాట్సప్,  ఫేస్ బుక్ లలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా పోస్టులు పెడుతున్నారని, వారు తమ వైఖరి  మార్చుకోకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవలసి వస్తుందని తెలియజేస్తున్నాను.

విబి కమలాసన్ రెడ్డి 
ఐ.పి.ఎస్.,  
కమీషనర్ ఆఫ్ పోలీస్
కరీంనగర్

click me!