రాధిక దారుణ హత్య... బాధిత కుటుంబానికి ఎంపీ బండి సంజయ్ హామీ

By Arun Kumar PFirst Published Feb 14, 2020, 10:21 PM IST
Highlights

కూతురు దారుణ హత్యకు గురవడంతో పుట్టెడు బాధలో వున్న రాధిక కుటుంబానికి అండగా ఉంటామని ఎంపీ బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఇవాళ ఆయన బాధిత కుటుంబాన్నిపరామర్శించారు. 

కరీంనగర్ లో దారుణ హత్యకు గురైన ఇంటర్మీడియట్ విద్యార్థిని రాధిక కుటుంబ సభ్యులను స్థానిక ఎంపీ బండి సంజయ్ కుమార్ పరామర్శించారు.  కూతురును కోల్పోయి పుట్టెడు బాధలో వున్న ఆ నిరుపేద కుటుంబానికి అండగా ఉంటామని ఎంపీ భరోసా ఇచ్చారు. 

విద్యార్థిని దారుణ హత్య తీవ్ర ఆవేదన కలిగించిందని అన్నారు. అనారోగ్యాన్ని ఎదుర్కొని  చదువులో రాణిస్తున్న అమ్మాయి హత్యకు గురికావడం బాధాకరమన్నారు. పోలీసులు కేసును వేగంగా దర్యాప్తు చేసి దోషులను పట్టుకోవాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. 

read more  పెద్దపల్లి జిల్లాలో కాల్పుల కలకలం... తిరుమల్ రెడ్డికి గన్ ఎలా వచ్చిందంటే....

దుర్ఘటనకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే పోలీసులకు సహకరించాలని చెప్పారు. ఎంపీ తో పాటు బాధిత కుటుంబాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు, కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, కచ్చు రవి, బీజేపీ నేతలు రాపర్తి ప్రసాద్, బల్బీర్ సింగ్ సర్దార్ పరామర్శించారు.

ఈ విద్యార్థిని హత్యకు గురయిన సంఘటనా స్థలాన్ని కరీంనగర్ పోలీస్ కమీషనర్ విబి కమలాసన్ రెడ్డి పరిశీలించారు. ఈ కేసును అన్నికోణాల్లో విచారిస్తూ వేగవంతంగా దర్యాప్తు జరుపుతున్నామని పేర్కొన్నారు. విద్యార్థిని రాధిక హత్యకు గురైన ప్రదేశంతోపాటు ఇంటి చుట్టుపక్క ప్రాంతాలను సైతం ఆయన పరిశీలించారు.  

ఈ కేసు చేధనకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయన్నారు. అత్యాధునిక సాంకేతిక నిపుణుల బృందాల సహకారం తీసుకుంటున్నామని చెప్పారు. అనుమానితులకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నామని, ఇందులో భాగంగా సిసి కెమెరాల డివిఆర్లను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నామని తెలిపారు. 

ఈ కేసు చేధన కోసం పోలీస్ శాఖ తీవ్రంగా కృషిచేస్తోందని తెలిపారు. విద్యార్థిని హత్య సంఘటనను ఉన్మాద చర్యగా అభివర్ణించారు. ఈ సందర్భంగా హత్యకు గురైన రాధిక కుటుంబసభ్యులతో మాట్లాడారు. నిందితులను పట్టుకున్న అనంతరం కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వేగవంతంగా విచారణ జరుపాలని న్యాయస్థానాన్ని కోరుతామని
చెప్పారు.

read more  శాయంపేటలో కాల్పులు: రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తిరుమల్ రెడ్డి అరెస్ట్

నిందితులకు శిక్షలు పడేవిధంగా చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన వారిలో అడిషనల్ డిసిపిలు ఎస్ శ్రీనివాస్(ఎల్అండ్ ఓ), జి చంద్రమోహన్(పరిపాలన), కరీంనగర్ టౌన్ ఎసిపి డాక్టర్ పి అశోక్, సిసిఎస్ ఎసిపి శ్రీనివాస్, వివిధ విభాగాలకు చెందిన అధికారులు దేవారెడ్డి ఇంద్రసేనారెడ్డి, ఆర్ ప్రకాష్, శశిధర్ రెడ్డి, రామచందర్ రావు, కిరణ్ లతోపాటు పలువురు అధికారులు, ప్రత్యేక బృందాలకు చెందిన పోలీసులు ఉన్నారు. 
 

click me!