ఆటో, హెచ్ఆర్‌ల్లో ఫుల్ డిమాండ్: డిసెంబర్‌లో పెరిగిన రిక్రూట్‌మెంట్లు

By sivanagaprasad kodatiFirst Published Jan 11, 2019, 7:54 AM IST
Highlights

2017తో పోలిస్తే 2018 డిసెంబర్ నెల ఉద్యోగార్థులకు తీపి కబురు అందించింది. 8 శాతం ఉద్యోగ నియామకాల సంఖ్య పెరిగింది. ప్రత్యేకించి ఆటోమొబైల్, హ్యుమన్ రీసోర్స్ (హెచ్ఆర్) విభాగాల్లో నియామకాలు పెరిగాయని నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ పేర్కొంది. బెంగళూరు, పుణెల్లోని ఐటీ సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా నియామకాలు చేసుకున్నాయి. 

గతేడాది డిసెంబర్ నెలలో ఎనిమిది శాతం నూతన నియామకాలు పెరిగాయి. ఈ సంగతి నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ తెలిపింది. 2017 డిసెంబరుతో పోలిస్తే నియామకాలు గతేడాది డిసెంబరులో ఇవి 8 శాతం మేర రాణించాయని చెబుతోంది.

ముఖ్యంగా వాహన, వాహన విడి భాగాల పరిశ్రమలో 24%, మానవ వనరుల విభాగంలో 17% చొప్పున నియమాకాల్లో వృద్ధిని నమోదు చేశాయని వివరించింది. ఐటీ-సాఫ్ట్‌వేర్‌ రంగంలో నియామకాలు 14% పెరిగినట్లు తెలిపింది. బెంగళూరు, ఢిల్లీలలో వరుసగా 13%, 10% మేర నియామకాలు పెరిగాయని నౌకరీ జాబ్ స్పీక్ పేర్కొంది.

Latest Videos

‘గతేడాది చాలా వరకు ప్రధాన నగరాల్లో, అగ్రగామి రంగాల్లో నియామాకాల వృద్ధి బాగున్నది. కొద్ది నెలలుగా ఐటీ, వాహన, వాహన విడిభాగాల రంగాల్లో నియమాకాలు మెరుగ్గా ఉంటున్నాయి. బీపీఓ, ఎఫ్‌ఎంసీజీ రంగాలకు ఇది మంచి ఏడాది. ఈ నియామకాల ధోరణి కొనసాగుతుందనే భావిస్తున్నాం’అని ఇన్ఫోఎడ్జ్‌ ఇండియా సీఎమ్‌ఓ సుమీత్‌ సింగ్‌ పేర్కొన్నారు. 

పారిశ్రామికంగా 22% వృద్ధి నమోదు కావడంతో చెన్నైలో నియామకాలు 9% పెరిగాయి. ముంబైలోనూ 9% మేర వృద్ధి రేటు కనిపించింది. ముఖ్యంగా ఇక్కడి ఎఫ్‌ఎంసీజీ రంగంలో నియామకాలు 12% పెరిగాయి. ఇక బెంగళూరులో నియామకాలు 13% హెచ్చాయి. ఇక్కడి ఐటీ-హార్డ్‌వేర్‌(18%), ఐటీ సాఫ్ట్‌వేర్‌(22%)లు ఈ విషయంలో ముందున్నాయి. 

పుణెలోని పరిశ్రమల నియామకాల్లో వృద్ధి 15 శాతం నమోదు కాగా అక్కడి ఐటీ పరిశ్రమ 20% మేర ఉద్యోగులను పెంచుకుంది. మూడేళ్ల వరకు అనుభవం ఉన్న ఉద్యోగుల నియామకాలు 9% పెరగ్గా.. మధ్య స్థాయి యాజమాన్య బాధ్యతల (8-12 ఏళ్లు) కోసం 7%, సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయి(13-16 ఏళ్ల అనుభవం)లో 2% చొప్పున వృద్ధి నమోదైంది.

click me!