తెలంగాణ స్టేట్ పాలిసెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల.. ఎగ్జామ్ డేట్ నుండి పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

By asianet news teluguFirst Published Jan 11, 2023, 6:18 PM IST
Highlights

టి‌ఎస్ పాలిసెట్ 2023 అర్హత ప్రమాణాల ప్రకారం  ఇప్పటికే 10వ తరగతి పాసైన లేదా 2023లో హాజరైన అభ్యర్థులందరూ టి‌ఎస్ పాలిసెట్ 2023కి హాజరు కావడానికి అర్హులు. పరీక్షకు అవసరమైన కనీస మార్కులు 35% . టి‌ఎస్ పాలిసెట్ 2023 ప్రశ్న పత్రంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఇంకా బయాలజీ నుండి మొత్తం 150 MCQ ప్రశ్నలు ఉంటాయి.  

తెలంగాణ పాలిసెట్ 2023 దరఖాస్తు ఫారమ్ విడుదల తేదీ, పరీక్ష తేదీని ఎస్‌బి‌టి‌ఈ‌టి ప్రకటించింది. ఎస్‌ఎస్‌సి బోర్డు పరీక్షలు పూర్తయిన తర్వాత 17 మే 2023న పరీక్ష నిర్వహించబడుతుంది. టి‌ఎస్ పాలిసెట్ 2023 దరఖాస్తు ఫారమ్ జనవరి 16, 2023న విడుదల చేయబడుతుంది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ – polycetts.nis.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.

టి‌ఎస్ పాలిసెట్ 2023 అర్హత ప్రమాణాల ప్రకారం  ఇప్పటికే 10వ తరగతి పాసైన లేదా 2023లో హాజరైన అభ్యర్థులందరూ టి‌ఎస్ పాలిసెట్ 2023కి హాజరు కావడానికి అర్హులు. పరీక్షకు అవసరమైన కనీస మార్కులు 35% . టి‌ఎస్ పాలిసెట్ 2023 ప్రశ్న పత్రంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఇంకా బయాలజీ నుండి మొత్తం 150 MCQ ప్రశ్నలు ఉంటాయి.  

టి‌ఎస్ పాలిసెట్ 2023 అంటే ఏమిటి ? 
తెలంగాణ స్టేట్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS POLYCET) అనేది తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వ-సహాయక, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఎంట్రీ అందించే రాష్ట్ర-స్థాయి ప్రవేశ పరీక్ష.  

టి‌ఎస్ పాలిసెట్ 2023 పరీక్ష తేదీలు
రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ    16 జనవరి 2023
రిజిస్ట్రేషన్ చివరి తేదీ (లేట్ ఫీజ్ లేకుండా )     మార్చి 2023

హాల్ టికెట్ విడుదల తేదీ    మే 2023 1 వ  వారం
పరీక్ష  తేదీ                          17 మే 2023

జవాబు కీ విడుదల తేదీ     జూన్ 1 వ  వారం 2023
ఫలితాల ప్రకటన               జూన్ 2023 3 వ  వారం
టి‌ఎస్ పాలీసెట్ 2023 కౌన్సెలింగ్    జూలై 2023

 TS POLYCET ఫుల్ - ఫార్మ్: తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్
పరీక్ష నిర్వహించే వారు:    స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET)
పరీక్ష లెవెల్:  రాష్ట్ర స్థాయి పరీక్ష
దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్ 
పరీక్ష విధానం:  ఆఫ్‌లైన్ (పెన్ అండ్ పేపర్ ఆధారిత పరీక్ష)
పరీక్ష ఫ్రీక్వెన్సీ:  సంవత్సరానికి ఒకసారి
పరీక్ష వ్యవధి:  2.5 గంటలు (150 నిమిషాలు)
ప్రశ్నల సంఖ్య:  150
ప్రశ్నల రకం:  మల్టీ ఛాయిస్ క్వషన్స్ (MCQ)
దరఖాస్తు రుసుము:  జనరల్ క్యాటగిరి:  rs.400, SC/ST క్యాటగిరి:  rs.250
 మొత్తం సీట్లు:  35000 (సుమారు)
పరీక్షా కేంద్రాలు:  50
అధికారిక వెబ్‌సైట్:  polycetts.nic.in/ tspolycet.nic.in

అభ్యర్థులు ఈ వివరాలను ఫార్మ్ లో  నింపాలి:
వ్యక్తిగత సమాచారం
స్కూల్ సమాచారం
ఎడ్యూకేషనల్ బ్యాక్ గ్రౌండ్ 
కాంటాక్ట్ డిటేల్స్ 
తాజాగ్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అప్‌లోడ్ చేయాలి
డిజిటల్ సంతకం / సంతకం (ఆఫ్‌లైన్ ఫారమ్‌ను నింపే ముందు పెన్ను ఉపయోగించడం)
అభ్యర్థులు అన్ని వివరాలను సరిగ్గా నింపాలి లేకుంటే డిస్ క్వాలిఫైకి దారి తీస్తుంది
దరఖాస్తు పూర్తయిన తర్వాత అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ కన్ఫర్మేషన్ పేజీ ప్రింటౌట్ తీసుకోవాలి.

అర్హత ప్రమాణాలు
వయస్సు      వయో పరిమితి లేదు 
నేషనాలిటి   ఇండియన్( తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి)
అర్హతలు      స్టేట్ బోర్డ్ ఆఫ్ తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ లేదా ఏదైనా ఇతర సమానమైన పరీక్ష నిర్వహించే SSC పరీక్షలో ఉత్తీర్ణత; కనీసం 35% మార్కులు; గణితాన్ని తప్పనిసరి సబ్జెక్ట్‌గా అభ్యసించాలీ.


TS POLYCET 2023 పరీక్షా ప్యాటర్న్ 
పరీక్ష విధానం         ఆఫ్‌లైన్ (పెన్-పేపర్ ఆధారిత)
పరీక్షా మాధ్యమం    ఇంగ్లీష్ లేదా తెలుగు
మార్కింగ్ స్కీమ్       ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు
నెగటివ్ మార్కింగ్    నెగెటివ్ మార్కింగ్ లేదు 

టి‌ఎస్ పాలీసెట్ 2023 సిలబస్
టి‌ఎస్ పాలీసెట్ సిలబస్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంకా మ్యాథమెటిక్స్ అనే మూడు అంశాలు ఉంటాయి.  

స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్
అర్హత పొందిన అభ్యర్థులకు స్కాలర్‌షిప్‌లు మెరిట్ ఆధారంగా ఉంటాయి.

click me!