TSCAB Notification 2022: బ్యాంకు మేనేజర్ అవడమే మీ లక్ష్యమా అయితే తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ TSCAB బ్యాంక్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. మీరు తెలంగాణ స్థానికతతో పాటు అర్హత ఉంటే చాలు ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం మీ సొంతం అవుతుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే ఇది మీకు గుడ్ న్యూస్ తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ TSCAB బ్యాంక్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం ఖాళీల సంఖ్య 27 అని తెలిపింది. TSCAB అపెక్స్ బ్యాంక్ మేనేజర్ పోస్టు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 16 అక్టోబర్ 2022. TSCAB అపెక్స్ బ్యాంక్‌లో మేనేజర్ పోస్ట్ కోసం ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు TSCAB నోటిఫికేషన్ 2022 తప్పక తనిఖీ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవాలి.
తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్‌లో మేనేజర్ (స్కేల్-I) పోస్ట్ కోసం TSCAB నోటిఫికేషన్ 2022ని విడుదల చేసింది. TSCAB నోటిఫికేషన్ 2022 PDF రూపంలో పొందే వీలుంది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, TSCAB తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌లో మేనేజర్ పోస్ట్ కోసం మొత్తం 27 ఖాళీలను ప్రకటించింది. అభ్యర్థులు ఈ పోస్ట్‌లో TSCAB నోటిఫికేషన్ 2022కి సంబంధించిన అన్ని వివరాలను తనిఖీ చేయవచ్చు.
undefined
TSCAB నోటిఫికేషన్ 2022: ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రారంభ తేదీ: 28 సెప్టెంబర్ 2022
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 16 అక్టోబర్ 2022
ఆన్‌లైన్ పరీక్ష తాత్కాలిక తేదీ: నవంబర్ 2022
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ పూర్తిగా చదవండి..
ఆన్ లైన్ ద్వారా అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి..
విద్యా అర్హత
60% మొత్తం మార్కులతో గ్రాడ్యుయేషన్ లేదా 55% మొత్తం మార్కులతో కామర్స్ గ్రాడ్యుయేట్. తెలుగు భాషలో ప్రావీణ్యం అవసరం.
TSCAB నోటిఫికేషన్ 2022: వయో పరిమితి
కనీస వయస్సు: 20 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు
దరఖాస్తు ఫీజు
OC రూ. 950/-
SC/ST/PC/Ex-Serviceman రూ. 250/-
TSCAB నోటిఫికేషన్ 2022: ఎంపిక ప్రక్రియ
ప్రిలిమినరీ పరీక్ష
మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు.
ఎన్ని మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు..
TSCAB మేనేజర్ ప్రిలిమ్స్ పరీక్షలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనే 3 సబ్జెక్టులు ఉంటాయి. 100 మార్కులకు గానూ పరీక్ష నిర్వహిస్తారు.