ఎలాంటి రాత పరీక్ష లేకుండానే రూ.2 లక్షల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి..

By Krishna AdithyaFirst Published Oct 3, 2022, 12:58 AM IST
Highlights

కేంద్రప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేయడమే మీ లక్ష్యమా అయితే ఎలాంటి వ్రాత పరీక్ష లేకుండానే, ఉద్యోగం చేసే అవకాశం ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు పొందే వీలుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి..

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం యువతకు అనేక అవకాశాలను కల్పిస్తోంది. ఇందులో భాగంగా పలు కీలక ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అందించింది. ఇప్పటికే ఆయా విభాగాల్లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. అలాగే అటు రక్షణ విభాగంలోనూ కేంద్రప్రభుత్వం పలు ఉద్యోగాల భర్తీకి నడుం బిగించింది. రైల్వేలు అలానే ఇతర  కేంద్ర ప్రభుత్వ  సంస్థల్లో కూడా  ఉద్యోగాల భర్తీకి మోడీ ప్రభుత్వం  కృతనిశ్చయంతో ఉంది.

తాజాగా కోల్ ఇండియా లిమిటెడ్ మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు కోల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ coalindia.in ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

అంతే కాకుండా, coalindia.in లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా అభ్యర్థులు నేరుగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, మీరు కోల్ ఇండియా రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్ PDF లింక్ ద్వారా అధికారిక నోటిఫికేషన్‌ను కూడా తనిఖీ చేయవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కింద మొత్తం 41 పోస్టులను భర్తీ చేస్తారు.

దరఖాస్తుకు చివరి తేదీ - అక్టోబర్ 29

మొత్తం పోస్టుల సంఖ్య- 41

సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ (E4 గ్రేడ్) గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు.

సీనియర్ మెడికల్ ఆఫీసర్ / మెడికల్ స్పెషలిస్ట్ గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు.

ఇక వేతనం విషయానికి వస్తే, సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ వేతనం సుమారు రెండు లక్షల వరకు ఉంది.  అలాగే సీనియర్ మెడికల్ ఆఫీసర్ వేదం గరిష్ఠంగా ఒక లక్షా ఎనభై వేల వరకు ఉంది. 

ఇక విద్యార్హతల విషయానికొస్తే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి. 

అభ్యర్థులు స్పీడ్ పోస్ట్ ద్వారా నిర్ణీత ఫార్మాట్‌లో సక్రమంగా నింపిన దరఖాస్తు ఫారమ్‌ను జనరల్ మేనేజర్ (పర్సనల్ / ఇఇ), భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్, ఎగ్జిక్యూటివ్ ఎస్టాబ్లిష్‌మెంట్, కోయిలా భవన్, కోయిలా నగర్, బిసిసిఎల్ టౌన్‌షిప్, జిల్లా ధన్‌బాద్, జార్ఖండ్ – 826005కు పంపాలి.

tags
click me!