ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్‌ఈఎల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది.
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఈ సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న పలు యూనిట్లలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. సెప్టెంబర్ 7 దరఖాస్తులు చేసుకోవడానికి చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://careers.bhel.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.
నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 27 సీనియర్ మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) పోస్టులను భర్తీ చేయనున్నారు. మెడిసిన్, అనెస్తీషియా, రేడియాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అంతేకాకుండా సంబంధిత పనిలో ఏడాది అనుభవం తప్పనిసరి.
undefined
also read 10th అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. నెలకు రూ.69 వేల వరకు జీతం.. ఇప్పుడే ధరఖాస్తు చేసుకోండీ..
అభ్యర్థుల వయసు: 01-08-2021 నాటికి 37 ఏళ్లు మించకూడదు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను తొలుత అర్హతల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. తరువాత పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి చివరి ఎంపిక చేస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు నెలకి రూ. 70,000 నుంచి రూ. 2,00,000 వరకు జీతంగా అందిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు ఆగస్టు 18న ప్రారంభంకాగా సెప్టెంబర్ 07న ముగియనుంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:https://careers.bhel.in/