భారత దేశంలోని అగ్ర శ్రేణి సాఫ్ట్ వేర్ కంపెనీ అయినటువంటి టీసీఎస్ ఏకంగా భారీగా ఉద్యోగాల భర్తీకి తెర లేపింది.ఏకంగా 40 వేల పోస్టులను భర్తీ చేయనుంది. ఓ వైపు మాంద్యం దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా యాపిల్, గూగుల్ లాంటి సంస్థలు ఉద్యోగులను తొలగిస్తుంటే అటు టీసీఎస్ మాత్రం ఏకంగా 40 వేల మందిని ఉద్యోగులకు తీసుకునేందుకు సిద్ధం అవుతుండంతో నిరుద్యోగ యువతరంలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. టీసీఎస్ సంస్థ తమకు కావాల్సిన అనేక విభాగాల్లో భర్తీలు చేసేందుకు సిద్ధం అవుతోంది.
గత సంవత్సరం కూడా టీసీఎస్ కంపెనీ ఏకంగా 40 వేల మందిని రిక్రూట్ చేసుకొని పరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేసింది.అయితే ఈ సంవత్సరం కూడా 40 వేల మందిని రిక్రూట్ చేసుకునేందుకు టీసీఎస్ సిద్దం అవుతోంది. దీంతో ఈ అగ్ర కంపెనీ రిక్రూట్ మెంట్ కోసం నిరుద్యోగ యువత వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. మరీ ముఖ్యంగా క్యాంపస్ రిక్రూట్ మెంట్స్ ద్వారా దాదాపు 1 లక్ష మందిని రిక్రూట్ చేసుకునే దిశగా టీసీఎస్ ఆలోచిస్తోంది. ఈ ఉద్యోగాల కోసం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కు అత్యధికంగా అవకాశాలు కల్పించారు. ముఖ్యంగా బీఈ, బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు ఎక్కువగా అవకాశం కల్పించారు.
టీసీఎస్ లో ఉద్యోగం చేయడం అనేది ప్రతీ ఒక్కరి కల అనే చెప్పాలి. ఎందుకంటే టీసీఎస్ ఇప్పటికే 5 లక్షల 92 వేల మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంతో సమానంగా టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
undefined
ఇక టీసీఎస్ కంపెనీలో ప్రస్తుతం ప్రకటించిన ఉద్యోగాలకు 2019, 20, 21 సంవత్సరాల్లో ఇంజనీరింగ్ పాసైన గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. ME, M.Tech, MCA, M.Sc, BE, B.Tech పాసైన విద్యార్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు సంబంధిత కోర్సుల్లో కనీసం 60 శాతం మార్కులు వచ్చి ఉండాలని నిర్ణయించారు.
టీసీఎస్ ఉద్యోగాల కోసం nextstep.tcs.com క్లిక్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో రెండు విభాగాల ద్వారా రిక్రూట్ మెంట్ చేపడుతున్నారు. మొదటి విబాగంలో ఐటీ ఉద్యోగాలు జాబితా చేయగా, రెండో విభాగంలో బీపీవో ఉద్యోగాలను జాబితా చేశారు. మీకు కావాల్సిన జాబ్స్ ఉన్నాయో లేదో సంబంధిత విభాగాల్లోకి వెళ్లి వెతుక్కోవాల్సి ఉంటుంది. అలాగే రిజిస్ట్రేషన్ అనంతరం మీరు జాబ్ కోసం అర్హులు అవుతారు.
టీసీఎస్ దేశీయ మల్టీ నేషనల్ ఐటీ కంపెనీ ఇది ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. టాటా గ్రూపునకు చెందిన ఈ సంస్థ మొత్తం 46 దేశాల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. జూలై 2022 నాటికి టీసీఎస్ లో దాదాపు 6 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. టీసీఎస్ కంపెనీని 1968లో టాటా సన్స్ సంస్థ స్థాపించింది. తొలి నాళ్లలో ఈ కంపెనీ టాటా సన్స్ కు చెంది టిస్కో ( ప్రస్తుతం టాటా స్టీల్) ఉద్యోగులకు డ్యూటీ పంచ్ కార్డులను తయారు చేసింది.