రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు...ఐటీఐ అర్హత ఉంటే చాలు

By Sandra Ashok KumarFirst Published Dec 4, 2019, 12:49 PM IST
Highlights

సదరన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు డిసెంబరు 1 నుంచి 31 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సదరన్ రైల్వే (SR) స్కిల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారీ సంఖ్యలో వివిధ వర్క్‌షాప్‌లలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు డిసెంబరు 1 నుంచి 31 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

అప్రెంటిస్ పోస్టులు వివరాలు

also read నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశం

పోస్టుల వారీగా మొత్తం ఖాళీల సంఖ్య: 3,585

క్యారేజ్ వర్క్స్ (పెరంబూర్): 1208

సెంట్రల్ వర్క్‌షాప్ (గోల్డెన్ రాక్): 723

 సిగ్నల్ & టెలికమ్యూనికేషన్ వర్క్‌షాప్ (పొడనూర్): 1654

 
అర్హత: 10+2 విధానంలో పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటీఐ ఉండాలి. ఎంఎల్‌టీ పోస్టులకు ఇంటర్ (బైపీసీ) ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

also read IDBI bank jobs: ఐడీబీఐ బ్యాంకు నోటిఫికేషన్ విడుదల

వయోపరిమితి: 15 - 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంఎల్‌టీ పోస్టులకు 24 సంవత్సరాల వరకు అవకాశం ఉంది.


ముఖ్యమైన తేదీలు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.12.2019.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.12.2019 (సా.5.00 గం)
 

click me!