SCCL Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సింగరేణిలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..!

By team telugu  |  First Published Jun 17, 2022, 8:36 PM IST

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది సింగరేణి యాజమాన్యం.  క్లర్క్(గ్రేడ్-2) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది. 
 


సింగరేణి నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 177 క్లర్క్(గ్రేడ్ -2) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు నోటిఫికేషన్ ఇచ్చింది. 

జూలై 10 చివరి తేదీ

Latest Videos

జూన్ 20వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్ లైన్ లోనే అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయి నోటిఫికేషన్ ను ఒకటి రెండు రోజుల్లో వెబ్ సైట్లో అప్ లోడ్ చేసే అవకాశం ఉంది.

అర్హతలు ఇవే

అభ్యర్థులు కనీస బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు కంప్యూటర్స్‌/ఐ.టీ ఒక సబెక్టుగా ఉన్నవారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ కలిగి ఉండి కంప్యూటర్స్‌లో డిగ్రీ లేదా డిప్లొమా లేదా ఆరు నెలల సర్టిఫికేట్‌ కోర్సు ఉండాలని స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారి గరిష్ట వయసు 30 ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికి ఐదు ఏళ్ల మినహాయింపు ఉంటుంది.

రాత పరీక్ష ఆధారంగానే

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో ప్రతిభ చూపిన ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు ప్రకటనలో స్పష్టం చేశారు. ఎలాంటి ఇంటర్వూలు లేవు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఈ ఖాళీలను 95శాతం లోకల్‌ అభ్యర్థులతో అంటే ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాలకు చెందిన వారితో భర్తీ చేయనున్నారు. మిగిలిన 5 శాతం పోస్టులు అన్‌ రిజర్వుడు కోటాకింద ఓపెన్‌ టు ఆల్‌ కింద భర్తీ చేయనున్నారు.

నోట్: అభ్యర్థులు ఈ లింక్ ద్వారా అధికారిక వెబ్ సైట్ సందర్శించవచ్చు. తగిన వివరాలను నమోదు చేసి.. పై ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

click me!