
Puch AI Internship: ఉద్యోగం కోసం వెతుకుతున్నవారికి అదృష్టం తలుపు తట్టింది. డిగ్రీ లేకపోయినా, హైస్కూల్ చదువుతున్న వారికీ లక్కీ ఛాన్స్. ఇంటి దగ్గరే పని చేస్తూ.. నెలకు రూ.2 లక్షల వరకు జీతం ఇచ్చే ఇంటర్న్‌షిప్ అవకాశం. ఈ బంపర్ ఆఫర్ ను భారతీయ స్టార్టప్ పచ్ AI ప్రకటించింది. AI Engineer, Growth Magician పోస్టుల కోసం ఇచ్చిన ఈ ఇంటర్న్‌షిప్ ఆఫర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఆఫర్ యువతకు కొత్త ఆశలు నింపుతోంది. ఆ వివరాలేంటో ఓ లూక్కేయండి..
భారతీయ స్టార్టప్ పచ్ AI నిరుద్యోగులు, విద్యార్థులకు బంపర్ అవకాశాన్ని అందిస్తోంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సిద్ధార్థ్ భాటియా తన X ఖాతాలో ఓ ఉద్యోగ ప్రకటన చేశారు. ఈ ట్వీట్ ప్రకారం.. నెలకు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు స్టైపెండ్‌తో ఇంటర్న్‌షిప్‌లను ఆఫర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఉద్యోగాలకు ఎలాంటి డిగ్రీ అవసరం లేదు. హైస్కూల్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఇంటర్న్‌షిప్ పూర్తిగా రిమోట్ వర్క్ విధానంలో ఉంటుంది. అంటే, ఇంటి నుంచే పని చేసి నెలకు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు స్టైపెండ్ పొందే అవకాశం ఉంది.
AI Engineer, Growth Magician అనే రెండు రోల్స్ కోసం నియామకాలు జరుగుతాయని తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ కూడా విభిన్నంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఆసక్తి ఉన్నవారు CEO భాటియా పోస్ట్‌లోనే కామెంట్ చేయాలి. తమ ప్రతిభ, ఉత్సాహాన్ని వివరించి ఎందుకు తామే ఎంపిక కావాలో చెప్పాలి.
సిద్ధార్థ్ భాటియా X పోస్ట్‌లోని కామెంట్స్ సెక్షన్‌లో, “మేము మిమ్మల్ని ఎందుకు ఎంపిక చేయాలి? పచ్ AIలో ఏ పని చేయడానికి ఇష్టపడుతున్నారు?”అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. డైరెక్ట్ మెసేజ్‌లు పంపవద్దని ఆయన స్పష్టంగా చెప్పారు. సరైన అభ్యర్థులను సూచించాలనుకునే వారు ట్యాగ్ చేయవచ్చు. ట్యాగ్ చేసిన వ్యక్తి ఎంపికైతే, ట్యాగ్ చేసిన వారికి iPhone బహుమతిగా ఇస్తామని భాటియా తెలిపారు.
పుచ్ AI ప్రస్తుతం ఒక హ్యాకథాన్ కూడా నిర్వహిస్తోంది. ఇందులో విజేతలకు నేరుగా ఇంటర్న్‌షిప్ ఆఫర్ ఇస్తారు. టాప్ 10లో వచ్చే వారికి కంపెనీ ఫౌండర్లతో డైరెక్ట్ ఇంటర్వ్యూ అవకాశం ఉంటుంది. ఈ బంపర్ ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లింక్డ్ఇన్‌లో పోస్ట్‌కు వెయ్యికి పైగా లైక్‌లు, 500కి పైగా కామెంట్‌లు వచ్చాయి. అనేకమంది యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి పోటీపడుతున్నారు. భారీ జీతం, డిగ్రీ అవసరం లేకపోవడం, ఇంటి నుంచే పని చేసే సౌకర్యం కారణంగా ఈ ఆఫర్‌పై ఆసక్తి పెరుగుతోంది.