ఐ‌టి‌ఐ అర్హతతో డీఆర్‌డీఓలో అప్రెంటిస్‌లు పోస్టులు.. వెంటనే అప్లయ్ చేసుకోండీ..

By Sandra Ashok KumarFirst Published Sep 26, 2020, 4:29 PM IST
Highlights

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డి‌ఆర్‌డి‌ఓ), రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సి‌ఐ) డాక్టర్ ఏ‌పి‌జే అబ్దుల్ కలాం క్షిపణి కాంప్లెక్స్ ప్రధాన ప్రయోగశాలలో ఖాళీగా ఉన్న ట్రేడ్ (ఐ‌టి‌ఐ ఉత్తీర్ణత) అప్రెంటిస్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

న్యూఢిల్లీ: కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ ఆధ్వ‌ర్యంలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డి‌ఆర్‌డి‌ఓ), రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సి‌ఐ) డాక్టర్ ఏ‌పి‌జే అబ్దుల్ కలాం క్షిపణి కాంప్లెక్స్ ప్రధాన ప్రయోగశాలలో ఖాళీగా ఉన్న ట్రేడ్ (ఐ‌టి‌ఐ ఉత్తీర్ణత) అప్రెంటిస్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదల తేదీ నుండి 10 రోజుల్లో ఆన్‌లైన్ మోడ్ ద్వారా డి‌ఆర్‌డి‌ఓ ఐ‌టి‌ఐ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Latest Videos

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ: నోటిఫికేషన్ విడుదల తేదీ నుండి 10 రోజుల్లోపు సమర్పించాలి.


డి‌ఆర్‌డి‌ఓ ఆర్‌సి‌ఐ ఖాళీ వివరాలు

ఐటిఐ అప్రెంటిస్ పోస్టులు- 90 
ఫిట్టర్‌లో ఐటిఐ - 25
ఎలక్ట్రానిక్ మెకానిక్‌లో ఐటిఐ - 20
ఎలక్ట్రీషియన్‌లో ఐటిఐ - 15
ఐటిఐ ఇన్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ - 10
టర్నర్‌లో ఐటిఐ - 10
మెషినిస్ట్‌లో ఐటిఐ - 05
వెల్డర్‌లో ఐటిఐ - 05

also read 

స్టైపెండ్: అప్రెంటిస్‌షిప్ నిబంధనల ప్రకారం నెలకు కన్సాలిడేటెడ్ స్టైఫండ్ రూ .7,700 నుండి రూ .8,050 ఇవ్వబడుతుంది

ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగానికి అర్హతలు:
రెగ్యులర్ అభ్యర్థులుగా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ (ఐటిఐ) పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 2018, 2019, 2020 సంవత్సరాల్లో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ (ఐటిఐ) లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే అర్హులు.

డి‌ఆర్‌డి‌ఓ ఆర్‌సి‌ఐ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

అర్హులైన అభ్యర్థులు మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (ఎంఎస్‌డిఇ) ఆన్‌లైన్ వెబ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి, అంటే www.apprenticeshipindia.org  రిజిస్ట్రేషన్ నంబర్‌ను పొందాలి.

ఎస్‌ఎస్‌సి, ఐడి ప్రూఫ్, క్వాలిఫికేషన్, కేటగిరీ (వర్తిస్తే), పిడబ్ల్యుడి పత్రాలు (వర్తిస్తే) మరియు ఆధార్ నంబర్‌ను అప్‌లోడ్ చేయడం ద్వారా వారు తమ ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేసుకోవాలి.

click me!