ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)లో మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు AAI అధికారిక సైట్ https://www.aai.aero/ లో పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వశాఖకు చెందిన ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)లో మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు AAI అధికారిక సైట్ https://www.aai.aero/ లో పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులు ఫైర్ సర్వీస్, టెక్నికల్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్, టెక్నికల్ తదితర విభాగాల్లో ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ 15 డిసెంబర్ 2020 నుండి చివరి తేదీ 14 జనవరి 2021. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 368 పోస్టులను భర్తీ చేస్తుంది.
undefined
మొత్తం ఖాళీలు: 368
మేనేజర్ (ఫైర్ సర్వీసెస్)- 11
మేనేజర్ (టెక్నికల్)-2
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)-264
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (విమానాశ్రయ కార్యకలాపాలు)-83
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (టెక్నికల్)-8
విభాగాలు: ఫైర్ సర్వీస్, టెక్నికల్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్, టెక్నికల్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
also read
అర్హత: పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణత, మేనేజర్ లెవెల్ పోస్టులకు అనుభవం ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ పోస్టులకు అనుభవం అవసరం లేదు.
వయసు: 30.11.2020 నాటికి మేనేజర్ పోస్టుకు-32 ఏళ్లు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు 27 ఏళ్లు మించి ఉండకూడదు.
ఎంపిక చేసే విధానం: ఆన్‌లైన్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్/ ఇంటర్వ్యూ/ ఫిజికల్ మెజర్‌మెంట్, ఎండ్యూరెన్స్ టెస్ట్/ డ్రైవింగ్ టెస్ట్/ వాయిస్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం: మేనేజర్ (ఈ-3) - రూ.60000 -1,80,000
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఈ-1) - రూ.40,000-1,40,000
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్:https://www.aai.aero/
ప్రాథమిక వేతనంతో పాటు, డియర్నెస్ అలవెన్స్, 35% ప్రాథమిక వేతనం, హెచ్‌ఆర్‌ఏ, సిపిఎఫ్, గ్రాట్యుటీ, సోషల్ సెక్యూరిటి స్కీంస్, వైద్య ప్రయోజనాలతో పాటు మొదలైన ఇతర ప్రయోజనాలు ఏఏఐ నిబంధనల ప్రకారం ఉంటాయి.
ధరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా 1000/-రూపాయలు చెల్లించాలి, ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులు కేవలం రూ.170/-. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు ఏఏఐ అధికారిక వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు.