ఇంటర్ అర్హతతో ఫోన్ పేలో ఉద్యోగాలు‌.. వెంటనే అప్లయ్ చేసుకోండీ కొద్దిరోజులు మాత్రమే..

Ashok Kumar   | Asianet News
Published : Nov 21, 2020, 05:59 PM IST
ఇంటర్ అర్హతతో ఫోన్ పేలో ఉద్యోగాలు‌.. వెంటనే అప్లయ్ చేసుకోండీ కొద్దిరోజులు మాత్రమే..

సారాంశం

నేటి వరకు ఎంతో మంది నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(ఏ‌పి‌ఎస్‌ఎస్‌డి‌సి) తాజాగా మరో ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. దేశీయ డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్ పే(Phone Pe)లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కోసం నియామకాలు చేపట్టినట్లు ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త‌. నేటి వరకు ఎంతో మంది నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(ఏ‌పి‌ఎస్‌ఎస్‌డి‌సి) తాజాగా మరో ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది.

దేశీయ డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్ పే(Phone Pe)లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కోసం నియామకాలు చేపట్టినట్లు ప్రకటించింది. ఈ ప్రకటన ద్వారా 75 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఈ పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు అని తెలిపింది.

అలాగే ద్విచక్రవాహనంతో పాటు ఆండ్రాయిడ్ ఫోన్ తప్పనిసరి కలిగి ఉండాలి అని పేర్కొంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్‌ 25 లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అభ్యర్ధించింది.

ఉద్యోగ వివరాలు
పోస్ట్ : మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
మొత్తం ఖాళీలు: 75

also read  పరీక్ష లేకుండా హైదరాబాద్‌ డి‌ఆర్‌డి‌ఓ-డి‌ఎం‌ఆర్‌ఎల్ లో ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.. ...
విద్యార్హత: ఇంటర్ లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
జీతం: బేసిక్ 11,500+పి‌ఎఫ్ +ఇన్సూరెన్స్+ఇన్సెంటీవ్స్(రూ. 3000-రూ. 5,000)
అనుభవం: సేల్స్ విభాగంలో కనీసం ఆరు నెలలు పని చేసిన అనుభవం ఉన్నవారికి ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది.

ప్రాంతాల వారీగా ఉన్న ఖాళీలు: చిత్తూరు, తిరుపతి-2, గుంటూరు అర్బన్-2, అనంతపూర్-5, కాకినాడ-7, కర్నూల్-2, ప్రకాశం-4, రాజమండ్రి-2, విజయనగరం, శ్రీకాకుళం-8, వెస్ట్ గోదావరి-6, వైఎస్సార్, కడప-2, విజయవాడ సెంట్రల్&ఈస్ట్-7, విజయవాడ వెస్ట్-4, వైజాగ్-24.

రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి  అభ్యర్ధులు ఇక్కడ క్లిక్ చేయండి

PREV
click me!

Recommended Stories

చ‌రిత్ర‌లోనే అతిపెద్ద లేఆఫ్‌, 30 వేల ఉద్యోగాలు ఫ‌సక్‌.. టెక్ దిగ్గ‌జం ఉద్యోగుల‌ ఊచ‌కోత‌
Jobs: తెలంగాణ వారికి పోర్చుగ‌ల్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ. ల‌క్ష‌న్న‌ర జీతం, ఎలా అప్లై చేసుకోవాలంటే