న్యూఢీల్లీ ప్రధానకేంద్రంగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), హెచ్ఆర్ఎం విభాగం సెక్యూరిటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
డిగ్రీ పూర్తి చేసి బ్యాంకు ఉద్యోగం కోసం చూస్తున్న వారి కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. న్యూఢీల్లీ ప్రధానకేంద్రంగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), హెచ్ఆర్ఎం విభాగం సెక్యూరిటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 15 దరఖాస్తు చేసువడానికి చివరితేది. మరింత పూర్తి సమాచారం కోసం https://www.pnbindia.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.
undefined
ఇందులో ఉన్న మొత్తం ఖాళీలు: 100
అర్హత: బ‌్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01 జనవరి 2021 నాటికి 21 నుంచి 35 ఏళ్లు మించకూడదు. ఎస్‌సి/ ఎస్‌టి అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల పాటు వయసులో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.48,170 నుండి రూ.69,810 వరకు ఉంటుంది.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు సంబంధిత బ్యాంకు వెబ్‌సైట్ https://www.pnbindia.in/ లో లాగిన్ అవ్వాలి. అందులో దరఖాస్తు ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసి కింద తెలిపిన చిరునామాకు పంపాల్సి ఉంటుంది.
also read ఇండియన్ రైల్వే నోటిఫికేషన్ విడుదల.. టెన్త్, ఐటీఐ అర్హత ఉన్నవారు వెంటనే ధరఖాస్తు చేసుకోండీ.. ...
దరఖాస్తు ఫీజుకు సంబంధించిన ఓచర్ కాపీతో కలిపి స్పీడ్/ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Chief Manager (Recruitment Section),
HRM Division, Punjab National Bank,
Corporate Office plot no 4,
Sector 10, Dwarka,
New Delhi - 110075.
దరఖాస్తు ఫీజు: రూ.500/-.
ఎంపిక చేసే విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఇంటర్వ్యూలో భాగంగా ఒక వ్యాసం / లేఖ సంబంధించిన పరీక్ష ఉంటుంది. పరీక్షలో షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు.
అధికారిక వెబ్‌సైట్: https://www.pnbindia.in/