పదో తరగతి అర్హతతో నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. వెంటనే ధరఖాస్తు చేసుకోండీ..

By S Ashok KumarFirst Published Jan 28, 2021, 6:19 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గ్రామీణ డాక్ సేవ‌క్ (జీడీఎస్‌) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఇందులో మొత్తం 3446 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

భార‌త ప్ర‌భుత్వ పోస్ట‌ల్ విభాగం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గ్రామీణ డాక్ సేవ‌క్ (జీడీఎస్‌) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఇందులో మొత్తం 3446 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌ కింద 2296 ఖాళీలు, తెలంగాణ సర్కిల్‌ కింద 1150 ఖాళీలు కేటాయించారు.

అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 దరఖాస్తులు చేసుకోవడానికి  చివరితేది. మరింత పూర్తి సమాచారం కోసం https://appost.in/ అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు.

గ్రామీణ డాక్ సేవ‌క్
1) బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్ (బీపీఎం)
2) అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్ (ఏబీపీఎం)
3) డాక్ సేవ‌క్‌

విద్యార్హతలు‌: మ్యాథ‌మెటిక్స్‌, లోక‌ల్ లాంగ్వేజ్‌, ఇంగ్లీష్ స‌బ్జెక్టుల‌తో ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులై ఉండాలి‌. అభ్య‌ర్థి క‌నీసం ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు లోక‌ల్ లాంగ్వేజ్‌లో చ‌దివి ఉండాలి. క‌నీసం 60 రోజుల శిక్ష‌ణా వ్య‌వ‌ధితో ఏదైనా కంప్యూట‌ర్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి బేసిక్ కంప్యూట‌ర్ ట్రెయినింగ్ కోర్సు స‌ర్టిఫికెట్ ఉండాలి.

also read 

కంప్యూట‌ర్‌ను ఒక స‌బ్జెక్టుగా ప‌దో త‌ర‌గ‌తిలో చ‌దివితే స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. సంబంధిత గ్రామ ప‌రిధిలో నివాసం పొందిన వారై ఉండాలి.

వ‌య‌సు: 21 జనవరి 2021  నాటికి 18-40 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్‌సి/ ఎస్‌టిల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

ఎంపిక విధానం: అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన స‌ర్టిఫికెట్ల‌ ఆధారంగా నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆటోమేటిక్ జ‌న‌రేటెడ్ మెరిట్ లిస్ట్ త‌యార‌వుతుంది. ఉన్న‌త విద్యార్హ‌త‌ల‌కు అద‌న‌పు వెయిటేజ్ ఏమీ ఉండ‌దు. కేవ‌లం ప‌దో త‌ర‌గ‌తిలో సాధించిన మార్కుల ఆధారంగానే చివరి ఎంపిక ఉంటుంది.
 
ద‌ర‌ఖాస్తు ఫీజు: ఓసీ/ బీసీ/ ఈడ‌బ్ల్యూఎస్ పురుష‌/ ట‌్రాన్స్-మెన్ అభ్య‌ర్థులు రూ.100 చెల్లించాలి. మ‌హిళా/ ట‌్రాన్స్‌-విమెన్‌, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఫీజు లేదు.

జీత‌భ‌త్యాలు: టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అల‌వెన్స్ (టీఆర్‌సీఏ) ప‌ద్థతిలో చెల్లింపులు ఉంటాయి.

బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్‌(బీపీఎం): క‌నీసం 4 గంట‌ల‌కు టీఆర్‌సీఏ రూ. 12000, క‌నీసం 5 గంట‌ల‌కు టీఆర్‌సీఏ రూ.14500 చెల్లిస్తారు.

ఏబీపీఎం/ డాక్ సేవ‌క్‌: క‌నీసం 4 గంట‌ల‌కు టీఆర్‌సీఏ రూ. 10000, క‌నీసం 5 గంట‌ల‌కు టీఆర్‌సీఏ రూ.12000 చెల్లిస్తారు.

 అధికారిక వెబ్‌సైట్‌:https://appost.in/

click me!