హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ) ఉద్యోగ ప్రకటన విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 434 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఐటిఐ, బి-టెక్, డిప్లొమా చేసిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ) ఉద్యోగ ప్రకటన విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 434 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వివిధ పోస్టులను బట్టి వేర్వేరు విద్యా అర్హతలను నిర్ణయించారు.
మొత్తం పోస్టుల ఖాళీలు
1. ఎగ్జిక్యూటీవ్ ట్రెయినీలు-67
ఎలక్ట్రికల్ - 10
మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ - 25
మెకానికల్ - 14
మైనింగ్ - 18
అర్హత: బీ.ఈ/బీ.టెక్ ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు. ఫైనల్ ఇయర్/సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. అలాగే సంబంధిత సబ్జెక్టుల్లో ఐదేళ్ల బీఈ/బీటెక్ + ఎంఈ/ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ డిగ్రీ చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: గరిష్టంగా 27 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ల ఆధారంగా గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు గేట్-2021 పరీక్షకు హాజరై ఉండాలి. ఈ పరీక్షలో సాధించిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో గేట్-2021 స్కోర్‌కి 70 మార్కులు, గ్రూప్ డిస్కషన్‌కి- 15, పర్సనల్ ఇంటర్వ్యూకి-15 మార్కులు కేటాయించారు.
also read
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 1 మార్చి 2021
దరఖాస్తులకు చివరితేది: 21 మార్చి 2021
అధికారిక వెబ్‌సైట్:https://www.nmdc.co.in/
3. ట్రెయినీ పోస్టులు- 304
ఫీల్డ్ అట్టెండెంట్ ట్రెయినీ - 65
మెయింటెనెన్స్ అస్సిస్టన్స్ ట్రెయినీ (మెకానికల్) -148
మెయింటెనెన్స్ అస్సిస్టన్స్ ట్రెయినీ (ఎలక్ట్రికల్)- 81
బ్లాస్టర్ జిఆర్ II ట్రెయినీ- 01
ఎంసిఓ జిఆర్-III ట్రెయినీ- 09
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: పోస్టులను బట్టి రాత పరీక్ష, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11 మార్చి 2021
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31 మార్చి 2021
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: 15 ఏప్రిల్ 2021
అధికారిక వెబ్‌సైట్:https://www.nmdc.co.in/