ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, ఐటీఐలో ఉత్తీర్ణత సాధించిన వారి కోసం ఎన్‌ఎండిసి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 59 ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది.
నేషనల్ మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 59 ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్ లేదా ఈ-మెయిల్ ద్వారా ధరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేది జూన్ 15. ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అభ్యర్ధులు పూర్తి వివరాల కోసం https://www.nmdc.co.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.
మొత్తం ఖాళీలు: 59
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్- 16
టెక్నీషియన్ అప్రెంటిస్- 13
ప్రోగ్రామింగ్ అండ్ సిస్టెమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్- 30
also read
విద్యార్హతలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మైనింగ్ ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో నాలుగేళ్ల డిగ్రీ (బీటెక్/బీఈ) చేసిన వారు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. వేతనం: ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 20 వేల వేతనం చెల్లించనున్నారు.
టెక్నీషియన్ అప్రెంటిస్: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్, మైనింగ్, మోడ్రన్ ఆఫీస్ ప్రాక్టీస్ మేనేజ్‌మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ కోర్సుల్లో మూడేళ్ల డిప్లొమో చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.16 వేల వేతనం చెల్లించనున్నారు.
అంతేకాకుండా పిఏఎస్‌ఏఏ పోస్టులకు కంప్యూటర్ ఆపరేటర్ ఇంకా ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(సిఓపిఏ ) నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల వరకు చెల్లించనున్నారు.
దరఖాస్తు విధానం: ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 15 జూన్ 2021
ఈ- మెయిల్: bld5hrd@nmdc.co.in
అధికారిక వెబ్‌సైట్:https://www.nmdc.co.in/