Bank Jobs: డిగ్రీ పాస్ అయ్యారా, కేంద్ర ప్రభుత్వ బ్యాంకు Nabard ఉద్యోగం మీ కోసం, నెలకు ఎంత జీతమో తెలుసుకోండి

By Krishna Adithya  |  First Published Sep 14, 2022, 1:08 PM IST

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యమా, అయితే మీకోసం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే నాబార్డ్ బ్యాంకులో ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి.  ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఆశించేవారికి పెద్ద వార్త. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని NABARD (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ & రూరల్ డెవలప్‌మెంట్ - NABARD) గ్రూప్-B 117 డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.


నాబార్డు డెవలప్ మెంట్  పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్ట్ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ దరఖాస్తు ప్రక్రియను రేపటి నుంచి అంటే సెప్టెంబర్ 15 నుండి ప్రారంభమవుతుంది. చివరితేదీని అక్టోబర్ 10గా నిర్ణయించారు. అయితే ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. నాబార్డ్ పోస్ట్ రిక్రూట్‌మెంట్, ఆసక్తి గల అభ్యర్థులు, పోస్ట్ వివరాలు, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు కోసం పరీక్ష తేదీని త్వరలో విడుదల చేయనుంది.  

NABARD Recruitment 2022 ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ - 15 సెప్టెంబర్ 2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ -10 అక్టోబర్ 2022
NABARD డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పరీక్ష తేదీ - త్వరలోనే ప్రకటిస్తారు.

Latest Videos

undefined

NABARD Recruitment 2022 ఖాళీల వివరాలు:
1. డెవలప్‌మెంట్ అసిస్టెంట్ - 173 పోస్టులు
2. డెవలప్‌మెంట్ అసిస్టెంట్ (హిందీ)- 4 పోస్టులు
   
NABARD Recruitment 2022 విద్యా అర్హత:
>> డెవలప్‌మెంట్ అసిస్టెంట్ విద్యార్హతల విషయానికి వస్తే, దరఖాస్తు చేసే అభ్యర్థి కనీసం 50 శాతం మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పాసై ఉండాలి. ( డిగ్రీ పాస్ అయి ఉండాలి)
>> డెవలప్‌మెంట్ అసిస్టెంట్ (హిందీ) - ఈ విభాగంలో మాత్రం అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి హిందీ భాషను తప్పనిసరిగా ఎంపిక సబ్జెక్ట్‌గా ఉండాలి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ప్రధాన సబ్జెక్ట్‌గా హిందీలో కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉండాలి.

NABARD Recruitment 2022 జీతం:
డెవలప్‌మెంట్ అసిస్టెంట్, డెవలప్‌మెంట్ అసిస్టెంట్ (హిందీ) పోస్టులకు ఎంపికైన తర్వాత అభ్యర్థులకు రూ. 32000 జీతం చెల్లిస్తారు. 

NABARD Recruitment 2022 వయో పరిమితి, దరఖాస్తు రుసుము:
అభ్యర్థులకు వయోపరిమితి 21 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల మధ్య నిర్ణయించారు. జనరల్ కేటగిరీ, OBC, EWS అభ్యర్థులు రూ. 450 దరఖాస్తు రుసుము, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు (SC/ST/PWD/EWS/Ex సర్వీస్‌మెన్) రూ.50 దరఖాస్తు రుసుము చెల్లించాలి చెల్లించాలి.

tags
click me!