117 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర కలిగిన ప్రముఖ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ సిటీ యూనియన్ బ్యాంక్,, దేశవ్యాప్తంగా 727 ప్లస్ శాఖల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ బ్యాంక్ లీగల్ డిపార్ట్‌మెంట్‌లో అనేక ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అనేక కొత్త ఉద్యోగావకాశాలను ప్రకటించింది.
సిటీ యూనియన్ బ్యాంక్ పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. పలు విభాగాల్లో ఖాళీల భర్తీల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు .సిటీ యూనియన్ బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్ కోసం దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 15 సెప్టెంబర్ 2022గా నిర్ణయించారు.
సిటీ యూనియన్ బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు:
పోస్ట్ : డిజిటల్ బ్యాంకింగ్ / ATM / కార్డ్ కార్యకలాపాలు / డేటా వేర్‌హౌస్ / సమాచార భద్రత / IS ఆడిట్ / ప్రత్యామ్నాయ ఛానెల్‌లు / డేటా సెంటర్ కార్యకలాపాలు / నెట్‌వర్క్ భద్రతా కార్యకలాపాలు
ఖాళీల సంఖ్య: నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
undefined
ముఖ్యమైన తేదీలు ఇవే...
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 15/09/2022
నోటిఫికేషన్ విడుదలైన తేదీ: 31/08/2022
ఎలా దరఖాస్తు చేయాలి:
ఈ ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరించనున్నారు.
జీతం: విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా వారికి నెలవారీ జీతం లభిస్తుంది.
ఎంపిక పద్ధతి:
రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
విద్యార్హతలు ఇవే:
అభ్యర్థులు AICTE/UGC లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాల/యూనివర్శిటీ నుండి పని సంబంధిత కోర్సులో BE, B.Tech, గ్రాడ్యుయేట్ డిగ్రీ, M.Sc, MCA, M.Tech, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఏదైనా పూర్తి చేసి ఉండాలి.
ఎక్స్ పీరియన్స్:
ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత రంగాలలో కనీసం 1 సంవత్సరం నుండి గరిష్టంగా 10 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. నోటిఫికేషన్‌లో పూర్తిగా చూడండి.
వయో పరిమితి ఇదే:
అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌లకు (స్కేల్ V) కనిష్టంగా 40 సంవత్సరాల నుండి గరిష్టంగా 50 సంవత్సరాలు
చీఫ్ మేనేజర్‌లకు (స్కేల్ IV) కనిష్టంగా 35 సంవత్సరాల నుండి గరిష్టంగా 45 సంవత్సరాల
సీనియర్ మేనేజర్‌లు / మేనేజర్‌లు / డిప్యూటీ మేనేజర్‌లు / అసిస్టెంట్ మేనేజర్‌లకు కనీసం 25 సంవత్సరాల
సీనియర్ బ్యాంకింగ్ మేనేజర్ / బ్యాంకింగ్ మేనేజర్ పోస్టులకు గరిష్టంగా 40 సంవత్సరాలు, కనిష్టంగా 22 సంవత్సరాల నుండి గరిష్టంగా 28 సంవత్సరాలుగా నిర్ణయించబడింది.
అభ్యర్థులు నోటిఫికేషన్‌లో వయస్సు సడలింపు గురించి మరింత సమాచారాన్ని పొందవచ్చు.
ముఖ్యమైన లింకులు ఇవే..
అధికారిక వెబ్ సైట్ ఇదే: www.cityunionbank.com
నోటిఫికేషన్ లో పూర్తి వివారాలను చూసేందుకు ఈ లింక్‌ని క్లిక్ చేయండి..
దరఖాస్తు ఫారమ్‌ను వీక్షించడానికి ఈ లింక్‌ని క్లిక్ చేయండి