LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
లైఫ్ ఇన్య్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(LIC HFL) దేశవ్యాప్తంగా అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. లా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు కలిగి ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
undefined
also read నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశం
పోస్టుల వివరాలు.
అసిస్టెంట్ మేనేజర్ (లీగల్): 35 పోస్టులు
మొత్తం రాష్ట్రాల వారీగా ఖాళీలు.
ఛత్తీస్‌గఢ్ 01
మధ్యప్రదేశ్ 01
బిహార్ 01
ఒడిశా 01
అసోం 01
వెస్ట్ బెంగాల్ 02
ఉత్తర్ ప్రదేశ్ 04
ఢిల్లీ 03
రాజస్థాన్ 01
చండీగఢ్ 01
కర్ణాటక 04
ఆంధ్రప్రదేశ్ 01
తెలంగాణ 02
కేరళ 01
తమిళనాడు 05
గుజరాత్ 01
మహారాష్ట్ర 05
మొత్తం ఖాళీలు 35
అర్హత: 55 శాతం మార్కులతో లా డిగ్రీ ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్ తప్పనిసరి.
వయోపరిమితి: 01.01.2019 నాటికి 23-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా.
also read IDBI bank jobs: ఐడీబీఐ బ్యాంకు నోటిఫికేషన్ విడుదల
రాతపరీక్ష విధానం.
మొత్తం 200 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు.
పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు-50 మార్కులు (35 నిమిషాలు), లాజికల్ రీజనింగ్ 50 ప్రశ్నలు-50 మార్కులు (35 నిమిషాలు), జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు (15 నిమిషాలు), ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 ప్రశ్నలు-50 మార్కులు (35 నిమిషాలు) ఉంటాయి.
పరీక్ష సమయం 120 నిమిషాలు (2 గంటలు).
నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
నెల జీతం: రూ.56,000.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం 02.12.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 16.12.2019
ఆన్‌లైన్ పరీక్షతేది 27.01.2020