10వ తరగతి పాసైన వారికి ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు.. వెంటనే ఇలా అప్లయ్ చేసుకొండి..

By asianet news telugu  |  First Published Sep 6, 2021, 8:55 PM IST

10వ తరగతి, డిగ్రీ అర్హతతో  ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 30 దరఖాస్తులకు చివరి తేదీ. 


భారత ప్రభుత్వానికి చెందిన ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్, ఉత్తర ప్రదేశ్ (ఈస్ట్) డివిజన్ స్పోర్ట్స్ కోటాలో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. ఫుల్ టైమ్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది.

ఇందులో ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, బాడీ బిల్డింగ్, చెస్, క్రికెట్, సైక్లింగ్, కబడ్డీ, హాకీ, కరాటే లాంటి క్రీడల్లో రాణించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 30 దరఖాస్తులకు చివరి తేదీ. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://incometaxindia.gov.in/ వెబ్‌సైట్‌ చూడవచ్చు.

Latest Videos

undefined


మొత్తం ఖాళీలు: 28
ట్యాక్స్ అసిస్టెంట్- 13
మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 12
ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్- 3

 విద్యార్హతలు: ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ పాసై ఉండాలి. గంటకు 8,000 పదాలు డేటా ఎంట్రీ చేయాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 10వ తరగతి పాసై ఉండాలి. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులకు డిగ్రీ పాసై ఉండాలి.

also read 10వ తరగతి, ఇంటర్ విద్యార్ధులకు అలెర్ట్.. క్వాషన్ పేపర్ నమూనా విడుదల.. ఇవి తెలుసుకోండి..

వయస్సు: అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు జనరల్, ఓబీసీ కేటగిరీలో 5 ఏళ్లు, ఎస్‌సీ, ఎస్‌టీ కేటగిరీలో 10 ఏళ్లు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: దరఖాస్తుల్ని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత తదుపరి ప్రక్రియ కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది.

వేతనం: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు రూ.56,900, ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టుకు రూ.81,100, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టుకు రూ.1,42,400 వరకు వేతనం ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29 ఆగస్ట్ 2021

దరఖాస్తులకు చివరి తేదీ: 30 సెప్టెంబర్ 2021

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:

Income Tax Officer (Hq)(Admn),
O/o Principal Chief Commissioner of Income Tax,
UP (East), Aayakar Bhawan,
5-Ashok Marg,
Lucknow-226001.
అధికారిక వెబ్‌సైట్‌:https://www.incometaxindia.gov.in/

click me!