ఇండియా పోస్ట్ 38,926 గ్రామీణ డాక్ పోస్టులను నియమిస్తోంది. అభ్యర్థులు ఖాళీలు, అర్హత, అప్లికేషన్ లింక్ నోటిఫికేషన్‌లో చెక్ చేయవచ్చు.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్. ఇండియా పోస్ట్ ఆఫీస్ గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) ఖాళీ పోస్టుల రిక్రూట్‌మెంట్ ప్రకటించింది. భారతదేశంలోని వివిధ ప్రదేశాలలో దాదాపు 38,926 ఖాళీలు ఉన్నాయి. ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తిగల అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే అభ్యర్థుల వయస్సు 40 ఏళ్లు మించకూడదు.
ఇండియా పోస్ట్ జిడిఎస్ రిజిస్ట్రేషన్ 02 మే 2022 న ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు 05 జూన్ 2022న లేదా అంతకు ముందు దరఖాస్తు చేసుకోవాలి. indiapostgdsonline.gov.in ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM), డాక్ సేవక్‌గా నియామకం చేయబడతారు. BPM పోస్టుకి రూ. 12000, రూ. ABPM/ డాక్ సేవక్ కి 10,000 వేతనం చెల్లిస్తారు. ఈ పోస్టులకు ఎలాంటి వ్రాత పరీక్ష ఉండదు. మెరిట్ లిస్ట్ మాత్రమే రూపొందిస్తారు.
అన్ని GDS పోస్ట్‌లకు సైక్లింగ్‌పై అవగాహన తప్పనిసరి. స్కూటర్ లేదా బైక్ నడిపే అభ్యర్థి విషయంలో సైక్లింగ్ పరిజ్ఞానం కూడా పరిగణించబడుతుంది.
GDS 2022 తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ - 02 మే 2022
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ - 05 జూన్ 2022
ఇండియా పోస్ట్ GDS 2022 ఖాళీల వివరాలు
మొత్తం పోస్ట్‌లు - 38,926
ఇండియా పోస్ట్ GDS 2022 జీతం:
BPM - రూ.12,000/-
ABPM/DakSevak - రూ.10,000/-
ఇండియా పోస్ట్ GDS 2022 అర్హత ప్రమాణాలు
అర్హతలు: అభ్యర్థి భారత ప్రభుత్వం/రాష్ట్ర ప్రభుత్వాలు/భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలలో ఏదైనా గుర్తింపు పొందిన స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ ద్వారా నిర్వహించే గణితం అండ్ ఆంగ్లంలో ఉత్తీర్ణత సాధించి 10వ తరగతి సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ పొంది ఉండాలి.
వయో పరిమితి:
కనీస వయో పరిమితి- 18 సంవత్సరాలు
గరిష్ట వయో పరిమితి - 40 సంవత్సరాలు
ఇండియా పోస్ట్ GDS ఎంపిక ప్రక్రియ 2022
అభ్యర్థి మెరిట్ పొజిషన్ , పోస్ట్‌ల ప్రాధాన్యత ఆధారంగా సిస్టమ్ రూపొందించిన మెరిట్ జాబితా ప్రకారం ఎంపిక చేయబడుతుంది. నిబంధనల ప్రకారం అన్ని అర్హత ప్రమాణాలను నెరవేర్చడానికి లోబడి ఉంటుంది.
ఇండియా పోస్ట్ GDS ఉద్యోగాలు 2022 కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
దరఖాస్తును ఆన్‌లైన్‌లో https://indiapostgdsonline.gov.inలో మాత్రమే సమర్పించవచ్చు.
దరఖాస్తు ఫీజు: రూ. 100/-