Railway Jobs : డైరక్టు ఇంటర్వ్యూ ద్వారా రైల్వే జాబ్, వేతనం ఎంతో తెలిస్తే వెంటనే అప్లై చేస్తారు...

Published : Apr 30, 2022, 04:47 PM IST
Railway Jobs : డైరక్టు ఇంటర్వ్యూ ద్వారా రైల్వే జాబ్, వేతనం ఎంతో తెలిస్తే వెంటనే అప్లై చేస్తారు...

సారాంశం

IRCON Recruitment 2022 Notification: IRCON తన అధికారిక వెబ్‌సైట్‌లో ఫైనాన్స్ అసిస్టెంట్ సహా ఇతర పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. IRCON Recruitment 2022 దరఖాస్తు ప్రక్రియ, వయోపరిమితి, అర్హత మరియు ఇతర వివరాలను ఇక్కడ చూడండి.

Railway Jobs 2022: భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న IRCON ఇంటర్నేషనల్ లిమిటెడ్ ( IRCON International Limited) , ఫైనాన్స్ అసిస్టెంట్, హెచ్ఆర్ అసిస్టెంట్, IT ఇంచార్జ్ సహా పలు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 9 మే 2022. సీఏ/ సీఎంఏ ఇంటర్మీడియట్/ రెండేళ్ల పీజీ కోర్సు/ డిప్లొమా ఇన్ హెచ్‌ఆర్/ పర్సనల్/ ఐఆర్/ పీఎం & ఐఆర్/ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతకు సంబంధించిన వివరాలను నోటిఫికేషన్ నుండి పొందవచ్చు.

IRCON Recruitment 2022: ముఖ్యమైన తేదీలు
ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ - 9 మే 2022
ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరించడానికి చివరి తేదీ - 16 మే 2022

IRCON Recruitment 2022:  ఇర్కాన్ ఇంటర్నేషనల్ రిక్రూట్‌మెంట్ 2022 ఖాళీల వివరాలు
ఫైనాన్స్ అసిస్టెంట్ - 8 పోస్టులు
హెచ్‌ఆర్ అసిస్టెంట్ - 5 పోస్టులు
ఐటీ ఇంఛార్జ్ - 3 పోస్టులు

IRCON Recruitment 2022: ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్
ఫైనాన్స్ అసిస్టెంట్- CA/CMA ఇంటర్మీడియట్
HR అసిస్టెంట్ - కనీసం 60% మార్కులతో రెండు సంవత్సరాల పూర్తి సమయం PG/HR/పర్సనల్/IR/PM మరియు డిప్లొమా ఇన్ IR.
ఐటీ ఇంఛార్జ్ - కనీసం 60% మార్కులతో ఐటీ/కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ డిగ్రీ.

IRCON Recruitment 2022: గరిష్ట వయస్సు
ఫైనాన్స్ అసిస్టెంట్- 35 ఏళ్లు
HR అసిస్టెంట్- 35 సంవత్సరాలు
ఐటీ ఇంఛార్జ్- 35 ఏళ్లు

IRCON Recruitment 2022: జీతం ఎంత వస్తుంది
నెలకు 36000. ప్రతి సంవత్సరం రూ.2000 ఇంక్రిమెంట్ ఉంటుంది.
గమనిక- రిజర్వు చేయబడిన కేటగిరీ అభ్యర్థులు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు పొందుతారు.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

PREV
click me!

Recommended Stories

నెలనెలా రూ.1,77,500 సాలరీ.. మేనేజర్ స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, తెలుగు రాష్ట్రాల్లోనూ పోస్టింగ్
నెలనెలా రూ.2,40,000 జీతం, ఇతర బెనిఫిట్స్ .. డిగ్రీ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్