పోస్టల్‌ శాఖలో భారీగా ఉద్యోగాలు.. టెన్త్‌ పాసైన వారు ఇలా అప్లయ్‌ చేసుకోండి..

By asianet news teluguFirst Published Jul 23, 2021, 10:03 PM IST
Highlights

గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak- GDS) ఉద్యోగాల భర్తీకి సంబంధించి భారత పోస్టల్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 2357 పోస్టులను భర్తీ చేయనున్నారు. 

మీ సొంత గ్రామంలోనే ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగులకు సువర్ణా అవకాశం.  గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak- GDS) ఉద్యోగాల భర్తీకి సంబంధించి భారత పోస్టల్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగం పొందిన వారు మంచి జీతంతో పాటు ఇంటి వద్దే పని చేసుకోవచ్చు. అయితే ఈ జీడీఎస్‌ పోస్టులు పశ్చిమ బెంగాల్ పోస్టల్ సర్కిల్స్ లో అందుబాటులో ఉన్నాయి.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 2357 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి. బ్రాంచ్ మాస్టర్ పోస్టుకు జీతం రూ.12,000లు కాగా, మిగిలిన పోస్టులకు రూ.10,000 వేతనం లభిస్తుంది.

10వ, 12వ తరగతి లేదా అంతకంటే పై విద్యా స్థాయిల్లో కంప్యూటర్ సబ్జెక్టుగా ఉన్న అభ్యర్థులకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్  సర్టిఫికేట్ అవసరం లేదు. అంతేకాకుండా దరఖాస్తుదారులు తప్పనిసరిగా 10వ తరగతిలో గణితం, స్థానిక భాష, ఆంగ్లం సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం, విశ్వవిద్యాలయం, బోర్డులు లేదా ప్రైవేటు సంస్థలు నిర్వహించే కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సు సర్టిఫికేట్ ను కలిగి ఉండాలి. లేదా కనీసం 60 రోజుల శిక్షణ కోర్సును  బేసిక్ కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన సర్టిఫికేట్ సమర్పించాలి.

also read తెలంగాణలో అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. 10వ తరగతి ఉంటే చాలు..

వయస్సు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.  ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థలకు మూడు సంవత్సరాలు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు:  రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

మహిళలకు, ట్రాన్స్ మహిళా అభ్యర్థులకు, ఎస్‌సి, ఎస్‌టి, పి‌డబల్యూ‌డి అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కల్పించారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

దరఖాస్తులకు చివరితేది:  19 ఆగస్టు 2021 

అధికారిక వెబ్ సైట్ :  https://appost.in/ పై క్లిక్ చేసి ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోవడంతో పాటు దరఖాస్తు చేసుకోవచ్చు.

click me!