ఐడీబీఐ ఉద్యోగ నోటిఫికేషన్ 2021 విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 920 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ చేయనుంది. ఇందుకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నవారికి వారికి శుభవార్త. ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఇండస్ర్టియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడిబిఐ ) ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు ఏదైనా గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 18 దరఖాస్తులు చేసుకోవడానికి చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.idbibank.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.
undefined
పోస్టులు: ఎగ్జిక్యూటివ్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 920
విద్యార్హత: కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ లో డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
వయసు: 1 జులై 2021 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: మొదటి ఏడాది నెలకు రూ.29,000. రెండో ఏడాది నెలకు రూ.31,000. మూడో ఏడాది నెలకు రూ.34,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: ఈ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఇందులో మూడు విభాగాలుంటాయి. ప్రతి విభాగం నుంచి 50 ప్రశ్నలుంటాయి. పరీక్షా సమయం 90 నిమిషాలు.
also read హైదరాబాద్ బిఈఎల్ సంస్థలో ఉద్యోగాలు.. బీటెక్ అర్హత ఉంటే చాలు.. నెలకు రూ.35వేల జీతం..
టెస్ట్ ఆఫ్ రీజనింగ్- 50 ప్రశ్నలు - 50 మార్కులు
టెస్ట్ వర్కింగ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ - 50 ప్రశ్నలు - 50 మార్కులు
టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 50 ప్రశ్నలు - 50 మార్కులు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్‌సి, ఎస్‌టి, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.200, ఇతరులకు రూ.1000గా నిర్ణయించారు.
దరఖాస్తులకు చివరితేది: 18 ఆగస్టు 2021
పరీక్ష తేది: 5 సెప్టెంబర్ 2021
అధికారిక వెబ్‌సైట్:https://www.idbibank.in/