హైదరాబాద్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న 49 ప్రాజెక్ట్ ఇంజినీర్, ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు ఆగస్టు 4 దరఖాస్తులకు చివరితేది.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)- హైదరాబాద్ యూనిట్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్దతి ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు సంబంధించి అకాడమిక్ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆగస్టు 4 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://bel-india.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.
undefined
మొత్తం ఖాళీలు: 49
ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల్లో భాగంగా ఎలక్ట్రానిక్స్ విభాగంలో 36 పోస్టులు, మెకానికల్ విభాగంలో 08, కంప్యూటర్ సైన్స్ విభాగంలో 04, హ్యూమన్ రిసోర్సెస్ విభాగంలో 01 ఖాళీలు ఊన్నాయి.
విద్యార్హతలు: పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/బీఎస్‌సి (ఇంజనీరింగ్), హ్యూమన్ రిసోర్స్ స్పెషలైజేషన్‌లో ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ/ఎంహెచ్‌ఆర్‌ఎం/ఎంఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం తప్పనిసరి.
also read టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో రేపు ఉద్యోగ మేళా.. వెంటనే అప్లయి చేసుకోండీ..
వయసు: అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపులు ఉంటాయి.
ఎంపిక విధానం: అభ్యర్థులను అకడమిక్ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం: ప్రారంభ వేతనం రూ.35,000 ఉంటుంది. తర్వాత ప్రతి ఏడాది రూ.5 వేల చొప్పున పెంచుతారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ఫీజుగా రూ. 500 చెల్లించాలి. ఎస్‌సి/ఎస్‌టి/పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తులకు చివరితేది: 4 ఆగస్టు 2021
అధికారిక వెబ్‌సైట్:https://bel-india.in/