ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హౌజ్ కీపింగ్ స్టాఫ్, స్టోర్ కీపర్, కార్పెంటర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) గ్రూప్-సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హౌజ్ కీపింగ్ స్టాఫ్, స్టోర్ కీపర్, కార్పెంటర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మార్చి 13 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://indianairforce.nic.in/ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. మొత్తం ఖాళీల సంఖ్య 255.
undefined
అర్హతలు: ఈ పోస్టులకు టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వేతనంగా లెవెల్ -1 పోస్టులకు రూ.18,000, లెవెల్- 2 పోస్టులకు రూ.19,900, లెవెల్-4 పోస్టులకు రూ.25,500 ఇస్తారు.
అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ నింపి, డాక్యుమెంట్స్ జతచేసి నోటిఫికేషన్‌లో తెలిపిన అడ్రస్‌కు పోస్టులో పంపాలి.
also read
దరఖాస్తులు ప్రారంభం: 11 ఫిబ్రవరి 2021
దరఖాస్తుకు చివరి తేదీ: 13 మార్చి 2021
పరీక్ష తేదీ: ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 22 వరకు.
వయస్సు: 18 నుంచి 25 ఏళ్లు
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రాక్టీస్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
అధికారిక వెబ్‌సైట్:https://indianairforce.nic.in/