రాతపరీక్ష లేకుండా హైదరాబాద్‌లోని రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. ధరఖాస్తు చేసుకోవడానికి క్లిక్ చేయండి..

By S Ashok KumarFirst Published Feb 10, 2021, 5:14 PM IST
Highlights

నేష‌న‌ల్ ఎన్విరాన్‌మెంట‌ల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌( ఎన్‌ఈ‌ఈ‌ఆర్‌ఐ) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌  ఖాళీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఈ-మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

హైద‌రాబాద్‌లోని సీఎస్ఐఆర్‌-నేష‌న‌ల్ ఎన్విరాన్‌మెంట‌ల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌( ఎన్‌ఈ‌ఈ‌ఆర్‌ఐ) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌  ఖాళీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఈ-మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఫిబ్రవరి 15 దరఖాస్తులు చేసుకోవడానికి  చివరితేది. మరింత సమాచారం లేదా పూర్తి వివరాలకు https://www.neeri.res.in/ అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు. గడువు ముగిసిన తరువాత ధర్ఖస్తూలను అనుమతించబడవు.

మొత్తం ఖాళీల సంఖ్య : 20

ప్రాజెక్ట్ అసిస్టెంట్: 15 పోస్టులు

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా/ బీఎస్‌సి/ ఎం‌ఎస్‌సి ఉత్తీర్ణ‌త‌. అలాగే సంబంధిత వీభాగంలో అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 50 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం: నెల‌కు రూ.20,000+ హెచ్ఆర్ఏ చెల్లిస్తారు. 

also read 

ప్రాజెక్ట్ అసోసియేట్: 05 పోస్టులు

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఎం‌ఎస్‌సి/ ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత విభాగంలో అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం: నెల‌కు రూ.25000 + హెచ్ఆర్ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, వ‌ర్చువ‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. అభ్య‌ర్థులు పంపిన ద‌ర‌ఖాస్తుల‌ను స్క్రీనింగ్ క‌మిటీ స్క్రుటినైజ్ చేసి అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన‌ వారికి ఈమెయిల్‌/ ఫోన్ ద్వారా  మెసేజులు పంపిస్తారు. వ‌ర్చువ‌ల్ ఇంట‌ర్వ్యూ

తేది, ఇంట‌ర్వ్యూ లింక్‌, టైమింగ్ త్వ‌ర‌లో తెలియ‌జేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఈ-మెయిల్‌: hzcparecruit@gmail.com

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15 ఫిబ్రవరి 2021.

అధికారిక వెబ్‌సైట్‌:https://www.neeri.res.in/

click me!