టెన్త్‌, ఇంటర్‌ అర్హతతో ఇండియన్‌ నేవీలో ఉద్యోగాలు.. ధరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

By S Ashok KumarFirst Published Feb 12, 2021, 7:25 PM IST
Highlights

ఇందుకు స్పోర్ట్స్ కోటా ద్వారా అర్హులైన అవివాహిత పురుష అభ్య‌ర్థుల నుంచి   ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ ఖాళీ పోస్టుల భ‌ర్తీకి అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఇండియ‌న్ నేవీ 2021 సంవ‌త్స‌రానికి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు స్పోర్ట్స్ కోటా ద్వారా అర్హులైన అవివాహిత పురుష అభ్య‌ర్థుల నుంచి   ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఈ ఖాళీ పోస్టుల భ‌ర్తీకి అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 7 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https://www.joinindiannavy.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ చూడండి.  

Latest Videos

1) డెరెక్ట్ ఎంట్రీ పెటీ ఆఫీస‌ర్‌
అర్హ‌త‌: ఇంటర్మీడియ‌ట్‌ లేదా త‌త్స‌మాన ప‌రీక్ష ఉత్తీర్ణ‌త ఉండాలి‌.
స్పోర్ట్స్ ప్రొఫిషియ‌న్సీ: అంత‌ర్జాతీయ‌/ జాతీయ/ రాష్ట్ర స్థాయి సీనియ‌ర్/ జూనియ‌ర్ టీమ్ గేమ్స్‌, వ్య‌క్తిగ‌త అంశాల్లోనైనా పాల్గొని ఉండాలి.
వ‌య‌సు: కోర్సు మొద‌ల‌య్యే నాటికి అభ్యర్ధులు  17-22 ఏళ్ల మ‌ధ్య ఉండాలి అంటే 01.02.1999 - 31.01.2004 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.


2) సీనియ‌ర్ సెకండ‌రీ రిక్రూట్‌(ఎస్ఎస్ఆర్‌)
అర్హ‌త‌: ఇంటర్మీడియ‌ట్‌ లేదా త‌త్స‌మాన ప‌రీక్ష ఉత్తీర్ణ‌త‌.
స్పోర్ట్స్ ప్రొఫిషియ‌న్సీ: అంత‌ర్జాతీయ‌/జాతీయ/రాష్ట్ర స్థాయి/యూనివ‌ర్సిటీలో నిర్వ‌హించే ఇంట‌ర్ యూనివ‌ర్సిటీ టోర్న‌మెంట్ల‌లో పాల్గొని ఉండాలి.
వ‌య‌సు: అభ్యర్ధులు   కోర్సు మొద‌ల‌య్యే నాటికి 17-21 ఏళ్ల మ‌ధ్య ఉండాలి అంటే 01.02.2000 - 31.01.2004 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.

also read 

3) మెట్రిక్‌ రిక్రూట్స్‌(ఎంఆర్‌)
అర్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తి లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌ కలిగి ఉండాలి.
స్పోర్ట్స్ ప్రొఫిషియ‌న్సీ: అంత‌ర్జాతీయ‌/జాతీయ/రాష్ట్ర స్థాయి టోర్న‌మెంట్ల‌లో పాల్గొని ఉండాలి.
వ‌య‌సు: కోర్సు మొద‌ల‌య్యే నాటికి అభ్యర్ధులు   17-21 ఏళ్ల మ‌ధ్య ఉండాలి లేదా 01.04.2000 - 31.03.2004 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.

ఎంపిక విధానం: అర్హులైన అభ్య‌ర్థుల్ని సంబంధిత నేవ‌ల్ సెంట‌ర్స్‌లో ట్ర‌యల్స్‌కి పిలుస్తారు. ట్ర‌యల్స్‌లో అర్హ‌త సాధించిన వారికి ఐఎన్ఎస్ హ‌మ్లా, ముంబ‌యిలో మెడిక‌ల్ టెస్ట్ నిర్వ‌హిస్తారు. ‌
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 07 మార్చి 2021.
జీతం: ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.14,600 స్టేఫండ్ ఇస్తారు.
చిరునామా: 
THE SECRETARY, 
INDIAN NAVY SPORTS CONTROL BOARD, 
7th Floor, Chankya Bhavan,
INTEGRATED HEADQUARTERS, MoD(NAVY), NEW DELHI 110 021.
అధికారిక వెబ్‌సైట్‌:https://www.joinindiannavy.gov.in/

click me!