ఇంటర్‌తో పాటు ఐటీఐ అర్హత ఉన్నవారికి రైల్వేలో ఉద్యోగాలు.. వెంటనే అప్లయి చేయండి కొద్దిరోజులే అవకాశం..

By S Ashok KumarFirst Published Mar 22, 2021, 5:03 PM IST
Highlights

డీజిల్‌ లోకో మోడ్రనైజేషన్‌ వర్క్స్ ‌(డీఎండబ్ల్యూ) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఇంటర్మీడియెట్‌తో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

ఐ‌టి‌ఐ అర్హత ఉన్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇంటర్‌తో పాటు ఐటీఐ పాసైన  వారి కోసం ఇండియన్ రైల్వే ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. డీజిల్‌ లోకో మోడ్రనైజేషన్‌ వర్క్స్ ‌(డీఎండబ్ల్యూ) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.

ఇంటర్మీడియెట్‌తో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులను అకాడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. మార్చి 31 దరఖాస్తులు చేసుకోవడానికి చివరితేది. అభ్యర్థులు మరింత సమాచారం లేదా  పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌  https://dmw.indianrailways.gov.in/లో చూడవచ్చు.

Latest Videos


ఇందులో ఉన్న మొత్తం ఖాళీలు: 182
ఎలక్ట్రీషియన్‌: 70, మెకానికల్‌(డీజిల్‌): 40, మెషినిస్ట్‌: 32, ఫిట్టర్‌: 23, వెల్డర్‌: 17

అర్హత: ఇంటర్మీడియెట్‌తో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపికలు ఉంటాయి
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 31 మార్చి 2021
అధికారిక వెబ్‌సైట్‌:https://dmw.indianrailways.gov.in/

click me!