కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది ఈ నోటిఫికేషన్ల కింద పదవ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివిన నిరుద్యోగులకు అనేక అవకాశాలను కల్పిస్తోంది. తాజాగా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ దాదాపు 4 వేలకు పైగా ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంటుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) తాజాగా 4000కు పైగా ఖాళీలను భర్తీ చేసేందుకు మెగా రిక్రూట్‌మెంట్ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, స్టైపెండరీ ట్రైనీ, టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అవకాశం ఉంటుంది. ఈ పోస్టులకు మొత్తం 4374 ఖాళీలు ఉన్నాయి. ఇందులో స్టైపెండరీ కేటగిరీ-1కి 2946, స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-2కి 1216, టెక్నికల్ ఆఫీసర్ 181, టెక్నీషియన్ 24, సైంటిఫిక్ అసిస్టెంట్ 7 ఖాళీలు ఉన్నాయి.
BARC రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 24 నుండి ప్రారంభం కాబోతోంది. BARC రిక్రూట్‌మెంట్ దరఖాస్తు ప్రక్రియ మే 22 వరకు కొనసాగుతుంది. దీని కోసం BARC వెబ్‌సైట్ www.barc.gov.in ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
undefined
ఖాళీలు ఇవే…
స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-1 : 2946
స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-2 : 1216
టెక్నికల్ ఆఫీసర్ : 181
టెక్నీషియన్ (బాయిలర్ అటెండెంట్) : 24
సైంటిఫిక్ అసిస్టెంట్ : 7
విద్యార్హతలు ఇవే..
స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-1: 10వ తరగతి తర్వాత మూడేళ్ల డిప్లొమా లేదా 12వ తరగతి తర్వాత రెండేళ్ల డిప్లొమా/ ఐటీఐ/ బీఎస్సీ/ ఎమ్మెస్సీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.
స్టైపెండరీ కేటగిరీ-2: సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఫస్ట్ డివిజన్‌తో 10వ తరగతి ఉత్తీర్ణత. దీనితో పాటు సంబంధిత ట్రేడ్‌లో కూడా ఐటీఐ చేయాలి. లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ మరియు బయాలజీ సబ్జెక్టులతో 12వ తరగతి ఫస్ట్ డివిజన్ ఉత్తీర్ణత. దీంతో పాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ డెంటల్ చేయాలి.
టెక్నికల్ ఆఫీసర్: M.Sc., M.Library, BE/B.Tech చేసి ఉండాలి.
సైంటిఫిక్ అసిస్టెంట్ - ఫుడ్ టెక్నాలజీ/ హోమ్ సైన్స్/ న్యూట్రిషన్‌లో B.Sc.
టెక్నీషియన్ - 10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు 2వ తరగతి బాయిలర్ అటెండెంట్ సర్టిఫికెట్.
వయో పరిమితి
టెక్నికల్ ఆఫీసర్ : 18 నుండి 35 సంవత్సరాల
సైంటిఫిక్ అసిస్టెంట్ : 18 నుండి 30 సంవత్సరాల
టెక్నీషియన్ : 18 నుండి 25 సంవత్సరాల
స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-I : 18 నుండి 24 సంవత్సరాల
స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-II : 18 నుండి 22 సంవత్సరాలు
జీతం ఎంత ఇస్తారంటే..
టెక్నికల్ ఆఫీసర్ : 56100/-
సైంటిఫిక్ అసిస్టెంట్ : 35400/-
టెక్నీషియన్ : 21700/-
స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-1 : 1వ సంవత్సరం 24000/- 2వ సంవత్సరం 26000/-
స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ/20000/- 201వ సంవత్సరం/20 : 201వ సంవత్సరం