ఎంటీఎస్ పోస్టుల భర్తీకి ఎస్ఎస్‌సీ నోటిఫికేషన్: పూర్తి వివరాలు

By rajashekhar garrepally  |  First Published Apr 23, 2019, 3:56 PM IST

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్‌సీ) భారీ స్థాయిలో నియామకాలను చేపట్టేందుకు సిద్ధమైంది. ఎస్ఎస్‌సీ తన అధికారిక వెబ్‌సైట్(ssc.nic.in)లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 


స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్‌సీ) భారీ స్థాయిలో నియామకాలను చేపట్టేందుకు సిద్ధమైంది. ఎస్ఎస్‌సీ తన అధికారిక వెబ్‌సైట్(ssc.nic.in)లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఖాళీల వివరాలను ప్రకటించకపోయినప్పటికీ సుమారు 10,000 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దరఖాస్తు స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మే 29, 2019. రెండు దశల్లో రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు.

Latest Videos

undefined

మెట్రిక్యూలేషన్(10వ తరగతి) లేదా తత్సమాన పరీక్ష పాసైనవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు1, 2019 నాటికి వయస్సు 18 ఏళ్ల నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. టైర్-1 పరీక్ష జులై 2 నుంచి ఆగస్టు 6 మధ్య, టైర్-2 పరీక్ష నవంబర్ 17న ఉంటుంది.

దరఖాస్తు పీజు: రూ. 100(ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు ఫీజు మినహాయింపు ఉంది)

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుల ప్రారంభ తేదీ: ఏప్రిల్ 22, 2019
దరఖాస్తులకు చివరి తేదీ: మే 29, 2019(సా. 5గంటల వరకు)
ఆన్‌లైన్ పేమెంట్‌కు చివరి తేదీ: మే 31, 2019(సా. 5గంటల వరకు)
ఆఫ్‌లైన్ జనరేషన్ చివరి తేదీ: మే 31, 2019((సా. 5గంటల వరకు))
చలాన్ పేమెంట్ కు చివరి తేదీ: జూన్ 1, 2019
కంప్యూటర్ ఆధారంగా పరీక్ష(టైర్-1): ఆగస్టు 2, 2019 నుంచి సెప్టెంబర్ 6, 2019
టైర్-2 పరీక్ష(డిస్క్రిప్టివ్ పేపర్): నవంబర్ 17, 2019న

అప్లై చేయడం ఎలా?

ముందుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ఓపెన్ చేయాలి.
హోంపేజీలో log-in సెక్షన్‌లో  register now పైన క్లిక్ చేయండి.
మీ వివరాలతో రిజిస్టర్ చేసుకోండి.
దరఖాస్తు పూర్తి చేసి ఫొటోలు అప్‌‌లోడ్ చేయాలి.
చివరగా పేమెంట్ చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.
ఎంపికైన అభ్యర్థులకు రూ.20,200 వరకు నెలకు జీతం ఉంటుంది.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

click me!